శ్రీదేవి భౌతికకాయం తరలింపులో మరింత జాప్యం

x
Highlights

శ్రీదేవి భౌతికకాయం భారత్ చేరేందుకు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. చట్టబద్ధమైన పరీక్షలు, తనిఖీలు మూడు, నాలుగు గంటలు పట్టే అవకాశం ఉంది. దుబాయ్ కాలమానం...

శ్రీదేవి భౌతికకాయం భారత్ చేరేందుకు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. చట్టబద్ధమైన పరీక్షలు, తనిఖీలు మూడు, నాలుగు గంటలు పట్టే అవకాశం ఉంది. దుబాయ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నానికి అవన్నీ పూర్తవ్వవొచ్చు. ఈ లెక్కన మన దేశ కాలమానం ప్రకారం శ్రీదేవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేసరికి సాయంత్రం దాటే అవకాశాలు ఉన్నాయి.

దుబాయ్ లోని భారత కాన్సులేట్ జనరల్ అధికారులు అక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. డెత్ సర్టిఫికెట్ రాకుండా మృతదేహం అప్పగించరు కాబట్టి ప్రక్రియ పూర్తయ్యే సరికి సాయంత్రం దాటవచ్చని భారత అధికారులు చెబుతున్నారు. శ్రీదేవి మృతితో బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికే జరుగుతున్న హిందీ సినిమా షూటింగ్ లు కొన్ని నిలిపివేశారు. బాలీవుడ్ ప్రముఖులు, నేతలు, శ్రీదేవి సహనటులు అంధేరిలోని ఆమె నివాసానికి చేరుకున్నారు. శ్రీదేవి గౌరవార్ధం ఈసారి హోలీ పండగను జరుపుకోకూడదని బాలీవుడ్ నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories