logo
సినిమా

ఆ 29 కాస్మొటిక్ సర్జరీలు శ్రీదేవి ప్రాణం తీశాయా..?

ఆ 29 కాస్మొటిక్ సర్జరీలు శ్రీదేవి ప్రాణం తీశాయా..?
X
Highlights

అందంగా కనిపించడం కోసం శ్రీదేవి మరీ స్లిమ్ గా ఉండేందుకు బాగా మెయిన్ టెయిన్ చేశారు. జిహ్వ చాపల్యాన్ని...

అందంగా కనిపించడం కోసం శ్రీదేవి మరీ స్లిమ్ గా ఉండేందుకు బాగా మెయిన్ టెయిన్ చేశారు. జిహ్వ చాపల్యాన్ని నియంత్రించుకోవడమే కాక బాడీ ఆకృతిని పూర్తిగా అదుపులో ఉంచుకునేందుకు ఎంతో కసరత్తు చేశారు. ఎన్నో రకాల కాస్మొటిక్ సర్జరీలు చేయించుకున్నారు. అయితే శ్రీదేవి మృతికి ఈ సర్జరీలే కారణమని చెప్పలేకున్నా.. దీర్ఘకాలంలో అవి కూడా ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు.

అందానికి నిలువెత్తు చిరునామాగా అభిమాన లోకాన్ని ఆనంద పరవశుల్ని చేసిన శ్రీదేవి ఆ అందాన్ని కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వెండితెర సామ్రాజ్ఞిగా వెలిగిపోయేందుకు దాదాపుగా ఓ మహాయజ్ఞమే చేశారంటే అతిశయోక్తి కాదు. మీద పడుతున్న వయసు ప్రభావాన్ని జయించేందుకు తాను మరింత శ్రమించి అప్పుడే యవ్వనంలోకి ప్రవేశిస్తున్న అమ్మాయిలా సినిమాల్లో కనిపించారు.

ఇక అందంగా కనిపించడం కోసం శ్రీదేవి 29 కాస్మొటిక్ సర్జరీలు చేయించుకున్నారు. మిగతా సాధారణ సర్జరీల కన్నా కాస్మొటిక్ సర్జరీలు ప్రమాదకరమైనవి కావని నిపుణులు చెబుతున్నారు. కాస్మొటిక్ సర్జరీల వల్ల గుండెపోటు రావడం, కిడ్నీలు పాడైపోవడం వంటివి జరగవని ఇవి బాహ్య శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేస్తాయంటున్నారు. ఇక శ్రీదేవి మొహంలో ముడతలు రాకుండా మరింత తేజోవంతంగా కనిపించడం కోసం నుదుటి మీద బొటాక్స్ చేయించుకునేవారు. దీంతో ఆమె మొహం చాలా కాంతివంతంగా పసిపిల్లల్లో కనిపించే మృదుత్వంతో నిగనిగలాడేది.

అయితే హఠాత్ మరణానికి కాస్మొటిక్ సర్జరీ నేరుగా కారణం కాకపోయినా దాని ప్రభావం కూడా ఉంటుందంటున్నారు నిపుణులు. ప్రాథమిక సూత్రం ప్రకారం వైద్యులు ఏ సర్జరీ చేయాలన్నా పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని బట్టే నిర్ణయం తీసుకుంటారని కాస్మొటిక్ సర్జరీ కూడా ఫలితాలిచ్చేది పేషెంట్ ఆరోగ్య స్థాయిని బట్టే అంటున్నారు. ఈ క్రమంలో శ్రీదేవి బరువు తగ్గడాన్ని వారు పరోక్ష కారణంగా అనుమానిస్తున్నారు. అందంగా కనిపించడం కోసం కాస్మొటిక్ సర్జరీలు శరీరాన్ని అదుపులో ఉంచుకునేందుకు బరువు తగ్గడం మీద శ్రీదేవి ఎక్కువ శ్రద్ధ చూపారని ఈ అతి జాగ్రతల కారణంగా మానసికంగా స్ట్రెస్ కు గురవడమే కాక.. శరీర అవయవాల పనితీరు మీద ప్రభావం చూపుతుందంటున్నారు.

Next Story