logo
సినిమా

2 గంటలకు భారత్‌కు శ్రీదేవి భౌతికకాయం

2 గంటలకు భారత్‌కు శ్రీదేవి భౌతికకాయం
X
Highlights

ప్రముఖ సినీనటి, అతిలోక సుందరి శ్రీదేవి భౌతికకాయాన్ని దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో...

ప్రముఖ సినీనటి, అతిలోక సుందరి శ్రీదేవి భౌతికకాయాన్ని దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో భారత్‌కు తీసుకరానున్నారు. తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు శ్రీదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లారు. శనివారం రాత్రి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. శ్రీదేవి భౌతికకాయాన్ని దుబాయ్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ముంబైకి తీసుకొచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బాలీవుడ్ వర్గాలు సమాచారం. శ్రీదేవి హఠాన్మరణం చెందడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Next Story