logo
సినిమా

జీవితారాజ‌శేఖ‌ర్.. రెడీగా ఉండు: శ్రీరెడ్డి సంచ‌ల‌న పోస్టింగ్‌

జీవితారాజ‌శేఖ‌ర్.. రెడీగా ఉండు: శ్రీరెడ్డి సంచ‌ల‌న పోస్టింగ్‌
X
Highlights

కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా గళమెత్తి ఏకకాలంలో ప్రశంసలు, విమర్శలుఎదుర్కొంటున్న నటి శ్రీరెడ్డి..‘ఈ జీవితం ఇక...

కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా గళమెత్తి ఏకకాలంలో ప్రశంసలు, విమర్శలుఎదుర్కొంటున్న నటి శ్రీరెడ్డి..‘ఈ జీవితం ఇక చాలు! ఫస్ట్‌టైమ్‌ ఒంటరినయ్యాను.. అందరికీ ధన్యవాదాలు’ అంటూ వైరాగ్య వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మొబైల్‌ స్విచాఫ్‌ చేయడంతో ఒక్కసారిగా కలకలంరేగింది. అయితే, కొద్ది గంటల తర్వాత తిరిగి సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యారామె. తనపై వస్తున్న అన్ని విమర్శలకు బదులిస్తానని అన్నారు. `ఈ జీవితానికి ఇక చాలు` అంటూ కొద్దిసేపు క్రితం త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టింగ్ చేసిన శ్రీరెడ్డి తాజాగా మ‌రో సంచ‌లన పోస్టింగ్ చేసింది. త‌న పోరాటం ఆపేది లేద‌ని, ఇక‌పై లీగ‌ల్‌గా పోరాటం చేస్తాన‌ని వెల్ల‌డించారు. త‌న‌కు వార్నింగ్ ఇచ్చిన జీవితారాజశేఖ‌ర్‌కు స‌వాలు విసిరింది. ఓడిపోయినా, గెలిచినా పోరాటం ఆపేది లేద‌ని స్ప‌ష్టం చేసింది.

`ఈ ద‌శ‌లో నేను వెన‌క్కి త‌గ్గేది లేదు. ఓడిపోయినా, గెలిచినా మంచి కాజ్ కోసం పోరాటం మొద‌లుపెట్టాను. ఇక‌పై చాలా పాద‌ర్శ‌కంగా ఉంటాను. నేను ఎవ‌రికీ భ‌య‌ప‌డేది లేదు. నేను మ‌నిషిని.. నా జీవితంలో మంచి, చెడూ ఉన్నాయి. నా పోరాటం కొన‌సాగుతుంది. నా స్నేహితుల స‌హాయంతో ఈ పోరాటం కొన‌సాగిస్తా. పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేయ‌మ‌ని, లీగల్‌గా ఫైట్ చేయ‌మ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు చెప్పారు. ఓకే సార్‌.. మీ స‌ల‌హాను పాటిస్తా. మ‌న గొడ‌వ ఆపేద్దాం. నా క్ష‌మాప‌ణ‌ల‌తో అది ముగిసిపోయింది. మీ స‌ల‌హా ప్ర‌కారం న్యాయ‌పోరాటం చేస్తా.. జీవితారాజ‌శేఖ‌ర్ ముందు నువ్వు సిద్ధంగా ఉండు.. నా లీక్‌లు కొనసాగుతాయి` అంటూ శ్రీరెడ్డి పోస్టింగ్ చేసింది.

Next Story