ఉద్విగ్నంగా సాగిన సోనియా చివరి ప్రసంగం

ఉద్విగ్నంగా సాగిన సోనియా చివరి ప్రసంగం
x
Highlights

పార్టీ నాయకత్వ బాధ్యత వీడుతున్నానన్న బాధతోనో లేక కుమారుడు పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకున్నాడన్న సంతోషమో తెలీదుకానీ తన 19 ఏళ్ల సర్వీస్ లో ఎప్పుడూ లేని...

పార్టీ నాయకత్వ బాధ్యత వీడుతున్నానన్న బాధతోనో లేక కుమారుడు పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకున్నాడన్న సంతోషమో తెలీదుకానీ తన 19 ఏళ్ల సర్వీస్ లో ఎప్పుడూ లేని విధంగా సోనియా గాంధీ ఉద్వేగానికి లోనయ్యారు. రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టిన సందర్భంలో సోనియా ప్రసంగంలో మొత్తం తీవ్రమైన ఉద్వేగం తో సాగింది.

సోనియా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చివరి ప్రసంగం ఈ ప్రసంగం గత ప్రసంగాలకంటే భిన్నం ఇక్కడ ప్రత్యర్ధులపై విమర్శలు లేవు వాడి, వేడి హెచ్చరికలు లేవు గత స్మృతులను నెమరువేసుకునే విధంగా ఒకింత భారంగానే ఆమె ప్రసంగం సాగింది. 19ఏళ్లపాటూ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా సేవలిదించిన సోనియా వీడ్కోలు ప్రసంగంలో ఆబాధ కొట్టొచ్చినట్లు కనిపించింది. భర్త రాజీవ్ మరణాన్ని తన రాజకీయ ప్రస్థానానికి దారి తీసిన పరిస్థితులను ఆమె గుర్తు చేసుకున్నారు.

తన జీవితంలో ఎదురైన పరిస్థితులను తలచుకుంటూ ఒకంత భావోద్వేగానికి ఆమె గురయ్యారు. అత్త ఇందిరతో తనకున్న అనుబంధాన్ని అది తనకు ధైర్యాన్ని కలిగించిన తీరును ప్రస్తావించారు. రాహుల్ కు బాధ్యతలు కట్టపెట్టడంపై చాలా సంతోషంతో సోనియా కనిపించారు. కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో చాలా ఎన్నికలు ఓడిపోయిందని అలా అని నిరాశపడాల్సిన అవసరం లేదని అన్నారు జాతిఐక్యతకోసం పోరాడుతామని ఆ లక్ష్యం నుంచి కొంచెమైనా పక్కకు జరగబోమని సోనియా అన్నారు సోనియా ప్రసంగం సాగుతున్న సమయంలో బయట సేవాదళ్ కార్యకర్తలు టపాసులు పేల్చడంతో ఆమె ప్రసంగానికి పలుమార్లు అంతరాయం కలిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories