కరుణానిధి విగ్రహావిష్కరణలో ఒకే వేదిక పైకి ప్రతిపక్షాలు

కరుణానిధి విగ్రహావిష్కరణలో ఒకే వేదిక పైకి ప్రతిపక్షాలు
x
Highlights

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం చెన్నైలో అట్టహాసంగా జరిగింది. యూపీఏ ఛైర్మన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధినేత...

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం చెన్నైలో అట్టహాసంగా జరిగింది. యూపీఏ ఛైర్మన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కరుణ విగ్రహాన్ని రిమోట్ ద్వారా సోనియా ఆవిష్కరించారు.

చెన్నైలోని డీఎంకె పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ సీఎం కరుణానిధి కాంస్య విగ్రహాన్ని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంకె చీఫ్ స్టాలిన్‌, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేరళ సీఎం పినరయి విజయన్, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, రజనీకాంత్, శత్రుఘ్నసిన్హా, కుష్బూ, వైగో తదితరులు పాల్గొన్నారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రతిపక్షాలను మరోసారి ఒకే వేదిక పైకి తీసుకొచ్చినట్టయింది. అయితే ఈ కార్యక్రమానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ దూరంగా ఉండటంతో ఫ్రంట్‌తో వారు కలిసి నడవడంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

కరుణానిధి విగ్రహావిష్కరణ అనంతరం చెన్నైలోని వైఎంసీఏ మైదానంలో డీఎంకె శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేతలంతా పాల్గొన్నారు. దీంతో ఇదే వేదిక పైనుంచి ప్రతిపక్షాలు మరోసారి తమ ఐక్యత చాటుకుని థర్డ్ ఫ్రంట్ సంకేతాలను పంపించినట్టయింది. గతంలో కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన సమయంలోనూ ప్రతిపక్షాలన్ని ఒకే వేదిక పైకి వచ్చాయి. కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమం మరోసారి ప్రతిపక్షాలను ఒకే వేదికపైకి తెచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories