రాజీవ్ నన్ను ఆ సినిమాకి తీసుకెళ్లారు
అలనాటి బాలీవుడ్ నటుడు శశికపూర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన సంతాపాన్ని వ్యక్తం...
అలనాటి బాలీవుడ్ నటుడు శశికపూర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శశికపూర్ కూతురు సంజనా కపూర్‌కి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. శశికపూర్‌కు తాను వీరాభిమానినని, తాను, రాజీవ్ కలిసి ఇంగ్లండ్‌లో తొలిసారి శశికపూర్ సినిమా చూశామని ఆ లేఖలో పేర్కొన్నారు.
‘మీ నాన్న చనిపోయారని తెలిసి చాలా బాధపడ్డాను. శశికపూర్ నటించిన తొలి చిత్రం ‘షేక్‌స్పియర్‌వాలా’ చూసి ఆయనకి అభిమానినయ్యాను. ఈ సినిమాని 1966లో ఇంగ్లాండ్‌లో చూసినట్లు గుర్తు. ఆ సినిమా చూడటం మర్చిపోలేని అనుభవం. ఇందుకు కారణం సినిమా అద్భుతంగా ఉండటమేకాదు రాజీవ్ నన్ను ఈ సినిమాకి తీసుకెళ్లారు. ఆ తర్వాత శశి కపూర్ నటించిన చాలా చిత్రాలు చూశాను. గొప్ప నటుడు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారు. అది వెండితెరపై అయినా.. చిన్న ఆర్ట్ సినిమాలైనా. ఆ మధురమైన సినిమాలు మనకు శశి ఇచ్చిన గొప్ప కానుక. ఎలాంటి పాత్ర కోసమైనా కష్టపడి పనిచేసేవారు. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మీతోనే ఉంటాయి.’ అని సోనియా లేఖలో పేర్కొన్నారు.
Maheswar Reddy: నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. రాజీనామా చేయను
17 Aug 2022 7:58 AM GMTతిరుమలలో భారీ వర్షం
17 Aug 2022 7:01 AM GMTRenuka Chowdhury: లీడర్లు కాదు .. క్యాడర్ ముఖ్యం
17 Aug 2022 6:43 AM GMTమహారాష్ట్రలోని గోండియా దగ్గర ప్రమాదం
17 Aug 2022 5:44 AM GMTBJP vs TRS: జనగామలో ఫ్లెక్సీ వార్
17 Aug 2022 5:24 AM GMTవిశాఖలో వరుస హత్యల కేసును ఛేదించిన పోలీసులు
16 Aug 2022 7:28 AM GMTవరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMT
Monkeypox: మంకీపాక్స్‌కు ట్రంప్ పేరు పెట్టాలంటూ సూచనలు..
17 Aug 2022 4:15 PM GMTCM Jagan: ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 754 చికిత్స విధానాలు
17 Aug 2022 4:00 PM GMThmtv, హన్స్ ఇండియా ఆధ్వర్యంలో 75 మంది వైద్యులకు సత్కారం.....
17 Aug 2022 3:44 PM GMTTRS Party: ప్రభుత్వ పదవులు సరే.. పార్టీ పదవులు ఎలా...?
17 Aug 2022 3:30 PM GMT'సీతారామం' సినిమాకి నో చెప్పిన టాలీవుడ్ హీరోలు
17 Aug 2022 3:15 PM GMT