ఆ నొప్పిని భరిస్తూ ఏడ్చేశాను: సోనాలి

స్టార్ హీరోయిన్ సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు. సోనాలి పరిస్థితి...
స్టార్ హీరోయిన్ సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు. సోనాలి పరిస్థితి నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహెల్ ఇటీవల తెలిపారు. కాగా, చికిత్స క్రమంలో చాలా నొప్పిని భరిస్తున్నట్లు ఆమె తాజాగా చెప్పారు. తన ఆవేదనను తెలుపుతూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేశారు. దీంతోపాటు ఓ ఫొటోను షేర్ చేశారు.‘కొన్ని నెలలుగా మంచి, చెడు రెండూ అనుభవిస్తున్నా. చికిత్స జరుగుతుండగా కనీసం నా చేతి వేలు కూడా పైకెత్తలేనంతగా తయారయ్యా. శారీరకంగా మొదలైన ఆ నొప్పి కాస్త మానసికంగా కూడా భాధ పెడుతోంది. కీమో థెరపీ, సర్జరీ జరిగిన తర్వాత కనీసం నవ్వినా కూడా నొప్పి వచ్చేది. ప్రతి నిమిషం నాతో నేను పోరాటం చేస్తూ గడుపుతున్నా. చెడు రోజులు జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తుంటాయి. వాటిని ఎదుర్కొని సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
కొన్ని సందర్భాల్లో నొప్పిని భరిస్తూ ఏడ్చేశాను. మనకేం అవుతోందో కేవలం మనకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని అంగీకరిస్తేనే మంచిది. భావోద్వేగానికి గురి కావడం తప్పేం కాదు. కొన్నిసార్లు నెగిటివ్ ఎమోషన్స్‌కి లోనుకావడం కూడా తప్పు కాదు. కాకపోతే ఆ తర్వాత దానిని గుర్తించి ఆ ప్రభావం మనపై పడకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. మా అబ్బాయితో మాట్లాడటం, నిద్రపోవటం ద్వారా ఇవన్నీ మర్చిపోయి కాలం గడుపుతున్నా. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. త్వరలో ఇంటికి వచ్చేస్తా’ అని ఆ పోస్ట్‌లో పేర్కొంది సోనాలి. ఆమె చేసిన ఈ పోస్ట్ చుసిన నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతూ మెసేజీలు పెడుతున్నారు.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
మళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMTమా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన
21 May 2022 7:43 AM GMTబేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...
21 May 2022 7:28 AM GMTధైర్యం కంటే భయం గొప్పది అంటున్న కొరటాల శివ
21 May 2022 6:55 AM GMT