logo
జాతీయం

వివాహితతో కుమారుడి పరారీ..చివరికి తల్లిదండ్రులు..

వివాహితతో కుమారుడి పరారీ..చివరికి తల్లిదండ్రులు..
X
Highlights

కుమారుడు పక్కింటి వివాహితతో పరారవడంతో అవమానం భరించలేని తల్లితండ్రులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరులోని...

కుమారుడు పక్కింటి వివాహితతో పరారవడంతో అవమానం భరించలేని తల్లితండ్రులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరులోని కనకపుర తాలూకా కల్లిగౌడన దొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సిద్దరాజు (52), సాకమ్మ (42) అనే దం పతులు వ్యవసాయం చేసుకొని జీవ నం సాగించేవారు. వీరికి మను అనే కుమారుడు ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన పల్లవి అనే వివాహితతో మను కొంత కాలంగా ప్రేమలో ఉ న్నాడు. మను, వివాహిత పల్లవిలు గ్రామం నుంచి పరారీ అయ్యారు. కుమారుడి చర్యలతో గ్రామస్తులు తల్లితండ్రులను నిందిండంతో పాటు ఇంటి ముం దుకువచ్చి వివాహిత కుటుంబ సభ్యులు గొడవ చేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన వారు గురువారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కోడిహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story