సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు: కోర్టు సంచలన తీర్పు.. బీజేపీకి ఊరట!

సోహ్రబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 మంది పోలీసు ఆఫీసర్లు నిర్దోషులని ముంబైలోని ...
సోహ్రబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 మంది పోలీసు ఆఫీసర్లు నిర్దోషులని ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. షోహ్రబుద్దిన్ కేసులో ఆ ఆఫీసర్లను నిందించడానికి సరైన ఆధారాలు లేవని కోర్టు వెల్లడించింది. గ్యాంగ్ స్టర్ సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో 22 మందిని నిర్దోషులుగా ముంబైలోని ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం తీర్పనిచ్చింది. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కుట్ర పూరితంగా జరిగిందనడానికి ఆధారాల్లేవని కోర్టు వెల్లడించింది. 22 మంది నిర్దోషుల్లో 21 మంది గుజరాత్ రాజస్థాన్ కు చెందిన జూనియర్ స్థాయి పోలీసులే ఉన్నారు.
సోహ్రబుద్దీన్ అనుచరుడు తులసీరామ్ ప్రజాపతిని పోలీసులు కావాలనే ఎన్ కౌంటర్ పేరుతో హత్య చేశారన్న ఆరోపణలు నిజం కాదని న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో ప్రభుత్వం, ప్రాసికూషన్ కు సంబంధించి 210 మంది సాక్షుల సమాధానాలు సంతృప్తికరంగా లేవని కోర్టు తెలిపింది. సాక్షుల్లో 92 మంది విరుద్ధంగా సమాధానాలు చెప్పారని న్యాయస్థానం వెల్లడించింది. గుజరాత్ గ్యాంగ్ స్టర్ సోహ్రబుద్దీన్ షేక్ కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే నెపంతో 2005లో అహ్మదాబాద్ సమీపంలో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని ఆరోపణలు వచ్చాయి. సోహ్రబుద్దీన్ చనిపోయిన మూడు రోజుల తర్వాత ఆయన భార్య కౌసర్ మృతి చెందింది.2006లో సోహ్రబుద్దీన్ అనుచరుడు తులసీరామ్ ప్రజాపతి మరో ఎన్ కౌంటర్ లో చనిపోయాడు.
2010లో కేసు విచారణ సీబీఐ చేతికి వచ్చింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి గుజరాత్ హోం మంత్రి , ప్రస్తుత బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు 38 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ కేసులో అమిత్ షా కొన్ని నెలలు జైలుశిక్ష అనుభవించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసును గుజరాత్ నుంచి ముంబై పోలీసులకు 2013లో అప్పగించారు. సరైన ఆధారాలు లేనందున షాతో సహా 16 మందిపై కేసు కొట్టి వేశారు. మిగతా 22మందిని శుక్రవారం ముంబై సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లోయా 2014లో అనుమానాస్పదంగా మృతి చెందారు. ఓ వివాహ వేడుకకు వెళ్లిన ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ కేసులో తీర్పు మరికొన్ని రోజుల్లో రానున్న నేపథ్యంలో జస్టిస్ లోయా మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఆయన మృతిపై అప్పట్లో కుటుంబసభ్యులు సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కానీ జస్టిస్ లోయాది సహజ మరణమేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
ఉద్యోగులు పెన్షనర్లకి శుభవార్త.. రిటైర్మెంట్ చేసిన వెంటనే ప్రయోజనం..!
8 Aug 2022 4:15 PM GMTRajinikanth: రాజకీయ రంగ ప్రవేశంపై తలైవా ఏమన్నారంటే?!
8 Aug 2022 4:00 PM GMTLIC New Policy: ఎల్ఐసీ అదిరే పాలసీ.. ప్రతి నెలా రూ. 2190 చెల్లిస్తే...
8 Aug 2022 3:30 PM GMTCM Jagan: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..
8 Aug 2022 3:15 PM GMTవీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య భావోద్వేగ ప్రసంగం
8 Aug 2022 3:00 PM GMT