ప్రియా ప్రకాశ్ వారియర్‌ను మరిపించావ్ రాహుల్

కొంచెం ఆవేశం.. కొంచెం ఆక్రోశం.. కాస్త ఉద్వేగం.. కొంత కోపం... కొన్ని ఆరోపణలు.. మరెన్నో విమర్శలు.....
కొంచెం ఆవేశం.. కొంచెం ఆక్రోశం.. కాస్త ఉద్వేగం.. కొంత కోపం... కొన్ని ఆరోపణలు.. మరెన్నో విమర్శలు.. ప్రశ్నించారు.. నిలదీశారు.. అడగాల్సినవన్నీ అడిగేశారు.. కొన్ని అంశాలపై కడిగేశారు.. ఒక్క రాహుల్.. పది వేరియేషన్స్. భారత పార్లమెంటులో నేటి రాహుల్‌ను చూసిన దేశం.. అవాక్కైంది.
పార్లమెంట్ చరిత్రలో ఎన్నో అరుదైన సన్నివేశాలు జరిగాయ్. కానీ వాటిని మించిన సన్నివేశం కాదు సన్నివేశాలు ఇవాళ జరిగాయ్. అవిశ్వాసంపై లోక్‌సభలో జరిగిన చర్చలో రాహుల్ తన దూకుడు చూపించారు. గల్లా జయదేవ్ ప్రసంగం ద్వారా ఏపీ ప్రజల బాధ, ఆవేదన తెలుస్తున్నాయన్న రాహుల్ 21వ శతాబ్దపు రాజకీయ ఆయుధానికి ఏపీ ప్రజలు బాధితులని చెప్పారు. తర్వాత ఎన్డీయే ప్రభుత్వం, ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో సభలో గందరగోళం చెలరేగగా స్పీకర్ 10 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.
సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా రాహుల్ ఏమాత్రం తగ్గలేదు. మోడీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ ఆవేశపూరితంగా ప్రసంగించారు. రాఫెల్ ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందని రాహుల్ ఆరోపించారు. తాను స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడుని కలిసి ఈ ఒప్పందం గురించి అడిగానన్నారు. ఇలాంటి ఒప్పందమేమీ భారత్‌తో చేసుకోలేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు తనతో చెప్పారని రాహుల్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు వినగానే ప్రధాని మోదీ నవ్వాపుకోలేకపోయారు.
మోడీ చర్యకు రాహుల్ స్పందించారు. ప్రధాని మోడీ నవ్వుతూ కనిపిస్తున్నారు కానీ ఆయన లోలోపల ఆందోళన పడుతున్నారన్నారు. మోడీ తన కళ్లల్లోకి నేరుగా చూడలేకపోతున్నారని రాహుల్ చెప్పారు. ఎందుకంటే ఆయన నిజాయతీగా లేరని రాహుల్ అన్నారు. దీంతో ప్రధాని మోడీ మరింతగా నవ్వారు. నాపై మీకు కోపం, ద్వేషం ఉన్నాయి నేను వాటిని తొలగిస్తానంటూ రాహుల్ అప్పటివరకు ఆవేశపూరితంగా ప్రసంగించారు. తర్వాత రాహుల్ చేసిన చర్యకు ప్రధాని మోడీతో పాటు సభలోని సభ్యులంతా అవాక్కయ్యారు.
ప్రసంగం ముగిసిన తర్వాత రాహుల్ మోడీ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. ఈ పరిణామంతో మోడీ అవాక్కయ్యారు. తర్వాత రాహుల్‌ను పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి భుజం తట్టారు. ఇదే ఇప్పటివరకు హైలెట్ సీన్ అనుకుంటే.. దీనిని మించింది మరొకటుంది. ప్రధానికి హగ్ ఇచ్చిన తర్వాత తన స్థానంలోకి వెళ్లి కూర్చున్న రాహుల్ తోటి సభ్యులు ఏదో అడగటంతో కన్ను కొడుతూ కనిపించారు. ప్రధాని మోడీని రాహుల్ హగ్ చేసుకోవడం తర్వాత కన్నీగీటడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపైనా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
* ప్రియా ప్రకాశ్ వారియర్‌ను మరిపించావ్ రాహుల్.
* ప్రియా ప్రకాశ్ వారియర్‌ను బాగా ఫాలో అవుతున్నావా రాహుల్ జీ..ఆమె కన్నుకొట్టిన వీడియో మరిన్ని చూడండి.ఇంకా ఇంప్రూవ్ అవుతారు.
* రాహుల్ ప్రియా ప్రకాశ్ కంటే గొప్పగా కన్నుకొట్టగలరు. మున్నాభాయ్ కంటే ఇంకా గొప్పగా ఆలింగనం చేసుకోగలరు. ఇక ఆయనకేమీ రాదని ఎలా చెప్తాం?
* రాహుల్ మాట్లాడేదంతా నిజం కాదని ఆయన మరోసారి నిరూపించారు.
* రాహుల్..మోదీని ఆలింగనం చేసుకున్నారు. మీ పార్టీ నేతలకు కన్ను కొట్టారు. తర్వాత ఎవర్ని ఏంచేస్తారో?
* సోనియాజీ..రాహుల్‌ని జాగ్రత్తగా చూసుకోండి. ఆయన బహిరంగ ప్రదేశాల్లో కన్నుకొడుతున్నారు.
* ప్రియా ప్రకాశ్ వీడియోలు చూపించి రాహుల్‌ని దివ్యస్పందన బాగా తీర్చిదిద్దింది. ఆమె కష్టానికి ప్రతిఫలం ఈరోజు పార్లమెంట్‌లో కనిపించింది.
*రాహుల్ వర్సెస్ ప్రియా ప్రకాశ్..ఇద్దరిలో ఎవరు బాగా కన్నుకొట్టారు? అంటూ సోషల్ మీడియాలో రాహుల్ మోదీ ఆలింగనం, కన్నుకొట్టడం గురించి బాగా ట్రోల్ అవుతోంది.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT