సినిమా నిర్ణయాన్ని ఫ్యాన్స్ కి వదిలేసిన హీరో

సినిమా నిర్ణయాన్ని ఫ్యాన్స్ కి వదిలేసిన హీరో
x
Highlights

ఆయుష్మాన్ ఖురానా హీరోగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అంధాదున్'. ఈ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయింది. డార్క్ కామెడీ క్రైం...

ఆయుష్మాన్ ఖురానా హీరోగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అంధాదున్'. ఈ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయింది. డార్క్ కామెడీ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో టబు మరియు రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో గుడ్డివాడి పాత్రలో నటించిన ఆయుష్మాన్ ఖురానా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాను సౌత్ లో రీమేక్ చేయాలనుకుంటున్నాడు హీరో సిద్ధార్థ్.

ఈ మధ్యనే 'గృహం' అనే హారర్ సినిమాతో మనల్ని భయపెట్టిన సిద్దార్థ్ ఇప్పుడు 'అంధాదున్' రీమేక్ చేయాలని అనుకుంటున్నాడట. అయితే ఈ సినిమా రీమేక్ చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని ప్రేక్షకులకే వదిలేసాడు ఈ 'బొమ్మరిల్లు' హీరో. "ఈ అవకాశం నాకు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. 'అంధాదున్' సినిమా నేను రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది?" అని సోషల్ మీడియాలో ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు సిద్ధార్థ్. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను చేయమనే చెబుతున్నారు. అన్నీ కుదిరితే సిద్ధార్థ్ ఈ సినిమాలో రీమేక్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories