logo
జాతీయం

17 నిమిషాల్లోనే బాబ్రీ మ‌సీదును కూల్చేశాం..

17 నిమిషాల్లోనే బాబ్రీ మ‌సీదును కూల్చేశాం..
X
Highlights

అయోధ్యలోని బాబ్రీ మసీదుపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం 17 నిమిషాల్లోనే...

అయోధ్యలోని బాబ్రీ మసీదుపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం 17 నిమిషాల్లోనే బాబ్రీ మసీదును కూల్చేశామని ఆయన అన్నారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అయోధ్యకు వెళుతున్న నేపథ్యంలో రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం బీజేపీ ఎందుకు ఇంత ఆల‌స్యం చేస్తోంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అయోధ్యలో రాముడి ఆలయం నిర్మించాల్సిందేనని ఆయన అన్నారు. రామ మందిర నిర్మాణాన్ని వ్య‌తిరేకిస్తున్న‌వారు, మునుముందు దేశంలో తిరిగేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్ఫష్టం చేశారు. బాబ్రీ మ‌సీదును కూల్చేందుకు 17 నిమిషాలు ప‌డితే, మ‌రి ఆల‌య నిర్మాణం కోసం చ‌ట్టాన్ని చేయ‌డానికి ఎంత స‌మ‌యం ప‌ట్టాల‌ని రౌత్ ప్ర‌శ్నించారు. అయోధ్య‌లో రామ మందిర నిర్మాణం విష‌యంలో బీజేపీ స‌రైన దిశ‌లో అడుగులు వేయ‌డం విమర్శించారు.

Next Story