'పడీ పడి లేచే మనసు' ఫ్లాప్ పై శర్వా ఏమన్నాడంటే..

పడీ పడి లేచే మనసు ఫ్లాప్ పై శర్వా ఏమన్నాడంటే..
x
Highlights

'మహానుభావుడు' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో శర్వానంద్ 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి తో కలిసి 'పడి పడి లేచే మనసు' అనే సినిమాలో నటించాడు. హను...

'మహానుభావుడు' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో శర్వానంద్ 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి తో కలిసి 'పడి పడి లేచే మనసు' అనే సినిమాలో నటించాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. రెండవ రోజు నుండి కలెక్షన్లు తగ్గిపోతూ వచ్చాయి. ఇక ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం ఖాయం అని ట్రేడ్ కూడా డిక్లేర్ చేసేసింది. రిలీజ్ కు ముందు మంచి హైప్ సంపాదించినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. తాజాగా ఈ సినిమా ఫ్లాప్ విషయంలో శర్వానంద్ స్పందించాడు.

"పడి పడి లేచే మనసు సినిమాని నేను, దర్శకుడు హను చాలా ఇష్టపడి చేశాం. ఇది కచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నాను, కానీ మొదటి రోజు నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం చాలా బాధాకరమైన విషయం. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, ఈ సినిమా ఎప్పటికీ నా మనసుకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇకపై నేను ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ, 'పడి పడి లేచే మనసు' కచ్చితంగా నా జీవితంలో మరిచిపోలేని సినిమాగా నిలుస్తుంది. రివ్యూ రైటర్ లకు మరియు క్రిటిక్ లకు తమ ఉద్దేశాల్ని చెప్పినందుకు ధన్యవాదాలు" అని చెప్పుకొచ్చాడు శర్వా.

Show Full Article
Print Article
Next Story
More Stories