షాహిద్‌ కపూర్‌కు క్యాన్సరా?

షాహిద్‌ కపూర్‌కు క్యాన్సరా?
x
Highlights

బాలీవుడ్ స్టార్ నటుడు షాహిద్ కపూర్ కొంత కాలంగా ఉదర క్యాన్సర్‌తో తీవ్ర బాధపడుతున్నారనే వార్తాలు బాలీవుడ్ కోడై కూస్తుంది. ఈ క్యాన్సర్ ఇప్పుడు మొదటి...

బాలీవుడ్ స్టార్ నటుడు షాహిద్ కపూర్ కొంత కాలంగా ఉదర క్యాన్సర్‌తో తీవ్ర బాధపడుతున్నారనే వార్తాలు బాలీవుడ్ కోడై కూస్తుంది. ఈ క్యాన్సర్ ఇప్పుడు మొదటి దశలోనే ఉందని, ముంబయిలో షాహీద్ ఎవరికి తెలియకుండా రహస్యంగా చికిత్స చేసుకుంటున్నాని బాలీవుడ్ లో పుకార్లు తారాస్థాయికి చేరాయి. ఇక విషయంపై తాజాగా షాహిద్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా అభిమానులు ఎవరు కంగారు పడొద్దని సూచిస్తూ తప్పుడు వార్తాలను నమ్మకండి' అని ట్వీట్ చేశారు. తాజాగా ఇదే విషయమై షాహిద్ కుటుంబీకులు కూడా స్పందిస్తూ మీడియా వర్గాలు ఏది పడితే అది ఎలా వాళ్ల ఇష్టమేచ్చినట్లు రాస్తున్నారు. అసలు దేని ఆధారంగా తీసుకుని ఈ వార్తాలను రాస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు వదంతులు సృష్టిస్తే క్షమించే లేదని స్పష్టం చేశారు. ఎప్పుడైనా విషయం పూర్తి తెలుసుకొని రాయాలి కాని ఇలా పుకార్లు సృష్టించోద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories