Top
logo

బీజేపీతో కలిసి కేసీఆర్ రాజకీయ కుట్రలు‌: షబ్బీర్ అలీ

బీజేపీతో కలిసి కేసీఆర్ రాజకీయ కుట్రలు‌: షబ్బీర్ అలీ
X
Highlights

బీజేపీతో కలిసి కేసీఆర్ రాజకీయ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ....

బీజేపీతో కలిసి కేసీఆర్ రాజకీయ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలను వేధింపులకు గురిచేసి భయాందోళనలు సృష్టించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రమ పాస్ పోర్టులతో విదేశాలకు పంపించారని జగ్గారెడ్డిని అరెస్టు చేయించారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేసి ఐటీ సోదాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి కేసులు, సోదాలకు భయపడేది లేదన్న ఆయన కేసీఆర్‌కు పిచ్చిపట్టి ఏదో ఒకటి చేయాలని ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు షబ్బీర్ అలీ.

Next Story