ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్ర న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్

ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్ర న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్
x
Highlights

ఉమ్మడి హైకోర్టు విభజనకు అడుగులు పడుతున్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత క్రమంగా ఒక్కొక్కటీ విడిపోతున్నా.. హైకోర్టు మాత్రం ఇంకా...

ఉమ్మడి హైకోర్టు విభజనకు అడుగులు పడుతున్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత క్రమంగా ఒక్కొక్కటీ విడిపోతున్నా.. హైకోర్టు మాత్రం ఇంకా ఒక్కటిగానే ఉంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎక్కడి హైకోర్టు అక్కడే ఉంటుందని భావిస్తున్నా ఇంకా భవన నిర్మాణం, ఇతర సమస్యల కారణంగా ఇన్నాళ్లూ ఈ విషయంలో పెద్దగా కదలిక లేదు. అయితే, ఉమ్మడి హైకోర్టులోని న్యాయమూర్తులలో ఎవరు తెలంగాణకు ఉండాలి, ఎవరు ఆంధ్రప్రదేశ్‌కు ఉండాలన్న విషయమై హైకోర్టులో చేసిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా ఆమోదించింది. దాంతో జడ్జీల విభజనకు కావల్సిన లాంఛనాలు దాదాపు పూర్తయినట్లే.
ఇదిలా ఉంటే ఉమ్మ‌డి హైకోర్టును విభ‌జించేలా మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ అయ్యాయి. . ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైకోర్టు విభజనకు కేంద్ర న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి త్వరలో రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అనంత‌రం జూన్ 2వతేదీ నాటికి ఉమ్మడి హైకోర్టు విభజన జరగనుంది. అలాగే రాబోయో 6 నెలల్లో హైకోర్టు విభజన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అలాగే ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు చర్యలు, కమిటీని నియమించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories