logo
సినిమా

బండ్ల గణేష్ , ఎమ్మెల్యే రోజా ల మధ్య తీవ్ర వాగ్వాదం..!

బండ్ల గణేష్ , ఎమ్మెల్యే రోజా ల మధ్య తీవ్ర వాగ్వాదం..!
X
Highlights

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శిష్యుడు బండ్ల గణేష్, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ల మధ్య నిన్న...

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శిష్యుడు బండ్ల గణేష్, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ల మధ్య నిన్న తీవ్ర మాటల యుద్ధం జరిగింది.. ఒక ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో భాగంగా వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే సమయంలో వీరు ఒకరిపై మరొకరు మాటల దాడి చేసుకున్నారు.. మరీ నోటికి చెప్పలేని బూతు పదాలు వాడుతూ సభ్యసమాజం తల దించుకునేలా వ్యవహరించారు.." పక్కలెత్తుతున్నావా , ఎ నువ్వు వెళ్తావా " అన్న పదాలు ఒకానొక దశలో నిర్మాత బండ్ల గణేష్ అయితే శృతిమించి పోయి నోరు జారడం అనేది సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశయంగా మారింది..

అంతే కాదు ఎమ్మెల్యే రోజా కూడా ప్రజాప్రతినిధి అన్న విషయం మరచిపోయేలా ప్రవర్తించారు.. సహనం కోల్పోయి మాట్లాడటం అనేది ఒక ప్రజాప్రతినిధిగా ఆమెకు తగదదని జనసేన నేతలు చెబుతుంటే , ఆమె సహనాన్ని పరీక్షించేలా గణేష్ వ్యాఖ్యలు చేయడం తప్పు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఏది ఏమైనా ప్రసార మాధ్యమాల్లో కోట్లాది ప్రజలు చూస్తున్నారన్న విషయం మరచిపోయి ఒకరిపై మరొకరో విమర్శలు చేసుకోవడం సమాజానికి అంత మంచిది కాదు, ఒకవేళ ఇలానే ఒక పార్టీనో లేదా ఒక వ్యక్తినో సపోర్ట్ చేస్తూ ఒళ్ళు మరచిపోయి అసభ్యకర వ్యాఖ్యలు చేసుకోవడం తమను తాము అగౌరపరుచుకున్నట్టే అని తెలుసుకోండి..

Next Story