వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించడం రాజ్యంగ...
వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించడం రాజ్యంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇష్టపూర్వక శృంగారం నేరం కాదన్న సుప్రీంకోర్టు...వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించే ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 497ను ఏకగ్రీవంగా కొట్టివేస్తూ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగాపరిగణించడం వల్ల మహిళల సమానత్వ హక్కుకి భంగం కలుగుతోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వివాహేత సంబంధం ఆత్మహత్యకు దారి తీసినప్పుడే నేరంగా పరిగణించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించే ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 497 ఒక పురాతన చట్టమని, అది ఏకపక్షంగా ఉందని అభిప్రాయపడింది. సెక్షన్ 497తోపాటు సెక్షన్ 198 కూడా రాజ్యాంగ సమ్మతం కాదని వెల్లడించింది. సెక్షన్ 497 మహిళల సమాన అవకాశాలను కాలరాస్తోందని వ్యాఖ్యానించింది., మహిళలను సమానులుగా చూడని ఏ చట్టమైనా రాజ్యాంగ విరుద్ధమేనన్న అత్యున్నత న్యాయస్థానం..పరస్పర సమ్మతితో చేసే శృంగారం ఇకపై నేరం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. వివాహేతర సంబంధాల్లో పురుషులను మాత్రమే బాధ్యులను చేసే సెక్షన్ 497 సరికాదని, మహిళలకు కూడా సమాన హక్కులు ఉంటాయని పేర్కొంది.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
Baby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMTRajagopal Reddy: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతోంది..
12 Aug 2022 1:00 PM GMT