Top
logo

రహస్య పెళ్లి చేసుకున్న యాంకర్…

Highlights

ఒక ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా ఓ వెలుగు వెలుగుతున్న మణిమేఘాలై రహస్య వివాహం చేసుకొని వార్తల్లో నిలిచింది. ఈమె...

ఒక ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా ఓ వెలుగు వెలుగుతున్న మణిమేఘాలై రహస్య వివాహం చేసుకొని వార్తల్లో నిలిచింది. ఈమె ప్రేమకు తండ్రి అడ్డు చెప్పడం తో ఇంటి నుండి వెళ్లిపోయి బుధవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. వివాహ అనంతరం తన ట్విట్టర్ లో ఓ మెసేజ్ పెట్టింది. “ప్రేమకు మతం లేదు” అంటూ తెలిపి వారి పెళ్లి ఫోటోతో పాటు తను ఏ సందర్భంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఆమె వెల్లడించింది. ‘‘హుస్సేన్, నేను ఇవాళ పెళ్లి చేసుకున్నాం. సడెన్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. మా నాన్నను ఒప్పించడంలో ఫెయిల్ అయ్యాను. దీంతో ఈ డెసిషన్ తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఏదో ఒకరోజు ఆయన నన్ను అర్ధం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ప్రేమకు మతం లేదు. ఐ లవ్ యు హుస్సేన్. శ్రీ రామ జయం.. అల్లా’’ అంటూ ఆమె తెలిపింది.

Next Story