ర్యాలీ రద్దు.. తొలిసారి మోదీ వినూత్న ప్రచారం

Highlights

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియనుంది. చివరిరోజు కావడంతో అటు అధికార భాజపా, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలు హోరాహోరీగా ప్రచారంలో...

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియనుంది. చివరిరోజు కావడంతో అటు అధికార భాజపా, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలు హోరాహోరీగా ప్రచారంలో పాల్గొంటున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు అహ్మదాబాద్‌లో రోడ్‌షో నిర్వహించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు రోడ్‌షోకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రధాని మోదీ వినూత్నంగా ప్రచారంలో పాల్గొననున్నారు.

సబర్మతి నదిలో సీప్లేన్‌ (సముద్ర విమానం)లో ప్రయాణించి.. ధారోయ్‌ డ్యామ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి అంబాజీ ఆలయాన్ని దర్శించుకోబోతున్నారు. దేశంలో సీప్లేన్‌ ప్రయాణం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి గురించి మాట్లాడటం లేదని కాంగ్రెస్‌ విమర్శిస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీ కనీసం ఇలాంటి అభివృద్ధిని ఊహించి కూడా ఉండదని ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలోని అన్నిచోట్లా ఎయిర్‌పోర్టులో నిర్మించడం సాధ్యం కాదని, అందుకే వాటర్‌వేస్‌పై దృష్టిపెట్టామని, దేశంలోని 106చోట్లా వీటిని నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నామని ప్రధాని మోదీ వరుస ట్వీట్లలో వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories