చించేసిన టికెట్‌కు.. 461 కోట్ల జాక్‌పాట్

చించేసిన టికెట్‌కు.. 461 కోట్ల జాక్‌పాట్
x
Highlights

ఏదైనా విలువైన వస్తువును పోగొట్టుకొని తిరిగి పొందితే ఎంతో ఆనంద పడతాం. స్కాట్లాండ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకొంది. వందల కోట్ల విలువైన లాటరీ...

ఏదైనా విలువైన వస్తువును పోగొట్టుకొని తిరిగి పొందితే ఎంతో ఆనంద పడతాం. స్కాట్లాండ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకొంది. వందల కోట్ల విలువైన లాటరీ టిక్కెట్టును సిబ్బంది నిర్లక్ష్యంగా చింపేశారు. సీసీ పుటేజీలో చింపిన టిక్కెట్టు నెంబర్‌కే లాటరీ వచ్చిందని గుర్తించారు. దీంతో ఆ వ్యక్తికి లాటరీ డబ్బులను అందించారు. అబెర్‌డీన్‌ షైర్‌కు చెందిన ఫ్రెడ్‌ (57), లెస్లీ హిగిన్స్‌ (67) ‘లైఫ్‌ చేంజింగ్‌’ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. డ్రాలో తమ నంబర్‌ వచ్చిందేమోనని స్థానిక లాటరీ ఆఫీస్‌కి వెళ్లగా నిరాశే ఎదురైంది. మీ టికెట్‌కు లాటరీ తగల్లేదంటూ అక్కడి సిబ్బందిలో ఒకడు వారు కొన్న టికెట్‌ను చించేసి చెత్తబుట్టలో పడేశాడు.

అయితే అతడు సరిగ్గా చూడకోకుండా చించేశాడని హిగిన్స్‌కు అనుమానం వచ్చింది. దీనిపై ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా అతని నంబర్‌ను కనుగొని.. డ్రాలో హిగిన్స్‌ నెంబర్‌ ఉందని విచారణలో తేలింది. డస్ట్‌బిన్‌ను మొత్తం వెతికించి అతని టికెట్‌ను కనుగొన్నారు. దానికి మొత్తం రూ. 461 కోట్ల జాక్‌పాట్‌ తగిలింది. ఆ దంపతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. మొదటగా ఒక ఖరీదైన ఆడి కారు, కరీబియన్‌ దీవుల్లోని బార్బడోస్‌లో విలాసవంతమైన ఇల్లు కొనుగోలు కొనుక్కుంటానని ఆనందంగా చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories