logo
సినిమా

మహానటి వచ్చేందుకు.. ఇంకా టైమ్ ఉందట!

మహానటి వచ్చేందుకు.. ఇంకా టైమ్ ఉందట!
X
Highlights

టాలీవుడ్ లో ఆసక్తి పుట్టిస్తున్న మహానటి సినిమా షూటింగ్ వడివడిగా పూర్తవుతోంది. ఈ నెలాఖరుకే సినిమాను విడుదల...

టాలీవుడ్ లో ఆసక్తి పుట్టిస్తున్న మహానటి సినిమా షూటింగ్ వడివడిగా పూర్తవుతోంది. ఈ నెలాఖరుకే సినిమాను విడుదల చేద్దామని కూడా ప్లాన్ చేశారు. కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో.. సినిమా నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. ఇప్పుడే హడావుడిగా విడుదల చేసి ఇబ్బంది పడేకంటే.. అన్నీ పూర్తిగా పక్కాగా సెట్ చేసుకున్నాకే.. అనుకున్న ప్రకారం సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట.

ప్రస్తుతానికి సినిమా యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం బయటికి రాకున్నా.. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 29న మహానటి విడుదల అవడం.. దాదాపు అసాధ్యమే అని తెలుస్తోంది. ఆ తర్వాత.. వారానికో.. మరో పది రోజులకో పోటీ లేని సమయం చూసుకుని సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. కీర్తి సురేష్ లీడ్ రోల్ లో.. మోహన్ బాబు, దుల్కర్ సల్మాన్, సమంత లాంటి టాప్ స్టార్ క్యాస్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది.

Next Story