ఒక్కొక్కడికి మూడు చెరువుల నీళ్ళు తాగించా.. మీకు తాగించలేనా..

బిగ్‌బాస్ సీజన్ 2 ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది. తొలి ఎలిమెనేషన్‌లో మిస్ హైదరాబాద్ సంజన చౌదరి షో నుంచి బయటకు...
బిగ్‌బాస్ సీజన్ 2 ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది. తొలి ఎలిమెనేషన్‌లో మిస్ హైదరాబాద్ సంజన చౌదరి షో నుంచి బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆమె షో నుంచి బయటకు వెళ్తూ బిగ్‌బాంబ్‌ను బాబు గోగినేనిపై వేసింది. దీంతో అతను వారం రోజులు ఇంట్లోని సభ్యుల్లో ఎవరికి మంచినీళ్లు అవసరం వచ్చినా ఆయనే తీసుకెళ్లి ఇవ్వాలి. సంజన తనపై వేసిన బిగ్‌బాంబ్‌ను గోగినేని స్వీకరించడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ షోలోకి రాకముందు తాను అనేక టీవీ డిబేట్లలో పాల్గొన్నానని చెప్పారు. డిబేట్లలో ఒక్కొక్కరికి మూడు చెరువుల నీరు తాగించానని, అలాంటి తనకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారికి నీళ్లు ఇవ్వడం పెద్ద కష్టం కాదని తెలిపారు. బిగ్ బాస్ చెప్పిన రూల్స్ అన్నింటినీ కచ్చితంగా ఫాలో అవుతానని చెప్పారు. సంజన తనపై బిగ్ బాంబ్ ను ఎందుకు ప్రయోగించిందో తెలియదని... ఆమెను తాను ఎలాంటి ఇబ్బందికి గురి చేయలేదని తెలిపారు. ఆమె తనపై కోపం ఎందుకు పెంచుకుందో తెలియదని చెప్పారు.
‘నాపై అభిమానంతో, ప్రేమతో ఇంట్లోకి కొంత మంది మిత్రులు సంజన వేసిన బిగ్‌బాంబ్ రూల్ బ్రేక్ చేసి ఎవరి నీళ్లు వారే తెచ్చుకుంటామని అంటున్నారు. కానీ రూల్స్ బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు. బిగ్‌బాస్ చెప్పినట్లు నేను చేస్తాను’ అని బాబు గోగినేని పేర్కొన్నాడు.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా
20 May 2022 4:31 AM GMTగన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్
20 May 2022 4:17 AM GMTజమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMT