కొడుకుతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తూ సానియా సందడి!

కొడుకుతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తూ సానియా సందడి!
x
Highlights

భారత టెన్నీస్ క్రీడాకారిణి సానియామీర్జా ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సానియా మీర్జా మళ్లీ సోషల్‌ మీడియాలోకి మళ్లీ...

భారత టెన్నీస్ క్రీడాకారిణి సానియామీర్జా ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సానియా మీర్జా మళ్లీ సోషల్‌ మీడియాలోకి మళ్లీ అడుగుపెట్టింది. తమ చిన్నారి తనయుడికి స్వాగతం పలుకుతూ.. ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ఇవాళ ఆమె తన కుమారుడు ఇజాన్‌ తొలి పోటోను షేర్ చేసుకుంది. తన కుమారుడితో కలిసి షోయబ్ మాలిక్ ఆడుతున్న క్రికెట్ మ్యాచ్‌ను టీవీలో చూశానంటూ తెగా మురిసిపోయింది సానియామీర్జా.తల్లిగా నేను, కుమారుడిగా నా బిడ్డ ఇజాన్ ఈ ప్రపంచంలోకి వచ్చి 5 రోజులైంది. నా కుమారుడితో కలిసి తండ్రి ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ కూడా వీక్షించాం. మేము వచ్చాక నిజంగా ఇదే పెద్ద మ్యాచ్. గతంలో ఎప్పడూ సాధించనంత గొప్ప విజయం. ఇంతకు ముందెన్నడూ పొందనంత మధురానుభూతి.. అంటూ సానియా వ్యాఖ్యానించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories