Top
logo

ప్రపంచ ర్యాంకింగ్స్ లో సానియా మీర్జా డౌన్

Highlights

భారత డబుల్స్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ సానియా మీర్జా 2013 తర్వాత తొలిసారిగా మహిళల డబుల్స్ టాప్ -10...

భారత డబుల్స్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ సానియా మీర్జా 2013 తర్వాత తొలిసారిగా మహిళల డబుల్స్ టాప్ -10 ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే పురుషుల డబుల్స్ లో రోహన్ బొపన్న 15, దివిజ్ శరణ్ 50వ ర్యాంకుల్లో నిలిచారు. వెటరన్ స్టార్ లియాండర్ పేస్ 70, పూరవ్ రాజా 62, జీవన్ నెడుంజెళియన్ 97 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. పురుషుల సింగిల్స్ లో యుకీ బాంబ్రీ 140, రామ్ కుమార్ 148, ప్రజ్ఞేష్ 255, సుమిత్ నాగల్ 331, బాలాజీ 350 ర్యాంకుల్లో ఉన్నారు. 2016 సీజన్లో ప్రపంచ మహిళల డబుల్స్ నంబర్ వన్ ర్యాంకర్ గా ఉన్న సానియా 2017 సీజన్లో కేవలం ఒకే ఒక్క టైటిల్ గెలుచుకోగలిగింది. వరుస వైఫల్యాలతో టాప్ -10 ర్యాంకుల సైతం చోటు సంపాదించలేకపోయింది.

Next Story