ఇది తొలిరాత్రి

ఇది తొలిరాత్రి
x
Highlights

కోట్ల సంపద.. అనుభవించేందుకు అన్ని భోగాలు.. పంచ భక్ష పరమాన్నాలు.. రాజు తలుచుకుంటే దేనికి కొదువ. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ జీవితం రాజభోగాల మయం. అలాంటి...

కోట్ల సంపద.. అనుభవించేందుకు అన్ని భోగాలు.. పంచ భక్ష పరమాన్నాలు.. రాజు తలుచుకుంటే దేనికి కొదువ. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ జీవితం రాజభోగాల మయం. అలాంటి కండల ఖాన్.. కటకటాల పాలయ్యాక ఎలాంటి లైఫ్ ను అనుభవించాడు..? జైలు ఊచల వెనుక.. తొలిరాత్రి ఎలా గడిచింది..?

హమ్ సాథ్ సాథ్ హై అంటూ.. కృష్ణ జింకల వేటకు వెళ్లిన సల్మాన్ ఖాన్ ను.. ఆ వేట కేసు 20 యేళ్లుగా వెంటాడింది. మేమంతా ఒకటిగానే ఉన్నామని సినిమా తీసినా.. కృష్ణ జింకల కేసులో మిగిలిన వారు నిర్దోషులను తేలడంతో సల్మాన్ ఒంటరివాడయ్యాడు. మొత్తానికి నేరం రుజువుకావడంతో.. వేటగాడు కటకటాలపాలయ్యాడు. ఐదేళ్లు శిక్ష పడటంతో.. సల్లూభాయ్ ను జోధ్‌పూర్‌ జైలుకు తరలించారు. కలర్‌ఫుల్‌ లైఫ్‌కు కేరాఫ్ గా నిలిచిన ఈ హీరో.. రీల్ పై ఎన్నోసార్లు జైలుకు వెళ్లొచ్చాడు.. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం తొలిసారిగా శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకున్నాడు. గురువారం మధ్యాహ్నం తీర్పు వెలువడగానే.. ఢీలా పడ్డ సల్మాన్‌ను.. సాయంత్రానికి జోధ్‌పూర్‌ జైలుకు తరలించారు. ఐష్, కత్రీనా లాంటి హీరోయిన్లను దూరం చేసుకున్నప్పుడు కూడా కనబడని దిగులు.. జైలుకెళ్లాక సల్లూభాయ్ ఫేస్ లో మాత్రం స్పష్టంగా కనిపించింది. ఇక బెయిల్‌ గురించే ఆలోచిస్తూ.. నిద్ర పోయేందుకు చాలా తిప్పలు పడ్డాడు.

ఆశారాం బాపూ పక్క బ్యారక్‌లో ఉన్న సల్మాన్ కు.. స్పెషల్ ట్రీట్ మెంట్ లేదని జైలు అధికారులు తేల్చిచెప్పారు. ఓ చెక్క మంచం, నాలుగు దుప్పట్లను అందించారు. అయితే సల్మాన్ మేనేజర్ ఇంటి నుంచి ఆహారం, దుస్తులు తెచ్చినా.. వాటిని అనుమతించలేదన్నారు. కేవలం దుస్తులు మాత్రమే తీసుకుని తినుబండారాలను వెనక్కి పంపినట్లు వెల్లడించారు. అయితే జైలు అధికారులు.. రాత్రి పప్పు రోటీ ఇచ్చినా.. సల్మాన్.. సున్నితంగా తిరస్కించాడు. దీంతో ఈ వేటగాడు నిద్రపోయేందుకు చాలానే కష్టపడ్డాడు. అర్ధరాత్రి దాటాక కానీ నిద్రరాలేదు. రాత్రంతా భారంగా గడిచింది. తన జీవితంలో చూడని చీకట్లను నిన్న రాత్రి చూడాల్సి వచ్చింది. ఇక శుక్రవారం ఉదయం ఆరున్నర గంటలకు లేచిన సల్మాన్ కు.. జైలు క్యాంటిన్ కు పరుగులు తీశాడు. బ్రెడ్, పాలు తీసుకున్నాడు. మొత్తానికి జైల్లో తొలిరాత్రి చాలా భారంగా గడిచింది.


Show Full Article
Print Article
Next Story
More Stories