logo
సినిమా

సల్మాన్‌కు జైలు శిక్ష...ఇరకాటంలో బాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు

సల్మాన్‌కు జైలు శిక్ష...ఇరకాటంలో బాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు
X
Highlights

బాలివుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు కెరీర్ లోనే పెద్ద దెబ్బ తగిలింది. కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్ ను...

బాలివుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు కెరీర్ లోనే పెద్ద దెబ్బ తగిలింది. కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్ ను జోధ్ పూర్ కోర్ట్ దోషిగా తేల్చడంతో సినీ కెరీర్ కి బిగ్ బ్రేక్ పడింది. సల్లూ భాయ్.. దోషిగా తేలడంతో అతనితో సినిమాలు చేస్తున్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

జోథ్ పూర్ కోర్టు సల్మాన్ ఖాను దోషిగా తేల్చడంతో పాటు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో సల్మాన్ తో సినిమాలు చేస్తున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇరకాటంలో పడ్డారు. ప్రసుత్తం సల్మాన్ హీరోగా నాలుగు మూవీలు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలకు బ్రేక్ పడటంతో బాలీవుడ్ కు వెయ్యి కోట్లకుపైగా నష్టం వచ్చే అవకాశం ఉంది.

సల్మాన్ కు శిక్ష ఖరారు కావడంతో ఆయన యాక్ట్ చేస్తున్న నాలుగు మూవీలు ఆగిపోయినట్టే. సల్లూ భాయ్ హీరోగా జూన్ 15న రిలీజ్ కావాల్సిన 'రేస్ 3 మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. రేస్ 3 రిలీజైతే 250 కోట్లు వసూల్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు సల్మాన్ కు శిక్ష పడటంతో 'రేస్ 3' పై ఉన్న భారీ ఎక్స్ పెక్టేషన్స్ కు బ్రేక్ పడింది. సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమా భరత్. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భరత్ మూవీలో ఐదు పాత్రల్లో సల్మాన్ నటిస్తున్నాడు. భరత్ రిలీజైతే 3 వందల కోట్లు వసూల్ చేస్తుందని బాలీవుడ్ వర్గాలు లెక్కలేస్తున్నాయి.

ప్రజెంట్ సల్లూ భాయ్ చేతిలో ఉన్న మరో ప్రాజెక్టు దబాంగ్ 3. ఈ మూవీ ప్రభుదేవ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో రూపొందనున్న దబాంగ్ 3..300 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని అంచనా వేస్తున్నారు. వీటితో పాటు ప్రస్తుతం సల్మాన్ చేతిలో ఉన్న నాల్గో సినిమా 'కిక్ 2. సాజిద్ నదియావాల డైరెక్షన్ లో రానున్న 'కిక్ 2.. 250 కోట్లు వసూల్ చేస్తుందని భావిస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన విచారణలో బాలీవుడ్ స్టార్ హీరోకి శిక్ష తప్పలేదు. దీంతో ఇప్పుడు ఆయన ఒప్పుకున్న ప్రాజెక్టుల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.

Next Story