సైనా బెదిరింపులపై గుత్తా జ్వాలా సీరియస్

సైనా బెదిరింపులపై గుత్తా జ్వాలా సీరియస్
x
Highlights

గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్న 2018 కామన్వెల్త్ గేమ్స్ కు తనతోపాటు తన తండ్రిని అనుమతించకపోతే జట్టు నుంచి వైదొలగుతానంటూ సైనా నెహ్వాల్ బెదిరించడాన్ని...

గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్న 2018 కామన్వెల్త్ గేమ్స్ కు తనతోపాటు తన తండ్రిని అనుమతించకపోతే జట్టు నుంచి వైదొలగుతానంటూ సైనా నెహ్వాల్ బెదిరించడాన్ని భారత బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్ గుత్తా జ్వాల తప్పు పట్టింది. ఇప్పటికే పలుసార్లు కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొన్న సైనా లాంటి సీనియర్ ప్లేయర్ గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభానికి ముందు ఇలా హడావిడి చేయటం తగదని అవార్డుల కోసం, ఇళ్లస్థలాల కోసం, ప్రోత్సాహక నగదు బహుమతుల కోసం ట్విట్టర్ ద్వారా బెదిరించడం తనకు తెలియదని ట్విట్టర్ ద్వారానే సైనాను జ్వాల ఎద్దేవా చేసింది. అంతర్జాతీయ క్రీడల్లో దేశం కోసం ఆడటాన్ని అందరూ గొప్ప అదృష్టంగా భావిస్తారని...సైనా లాంటి ప్లేయర్ మాత్రం....తన డిమాండ్ నెరవేర్చకుంటే జట్టునుంచే వైదొలగుతానంటూ భారత ఒలింపిక్ సంఘాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ఏమాత్రం సమర్థనీయంకాదంటూ సలహా ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories