ఉత్కంఠ పోరులో సింధుపై సైనా విజయం

Highlights

82వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను సీనియర్ స్టార్ సైనా నెహ్వాల్ గెలుచుకొంది. నాగపూర్ వేదికగా ముగిసిన ఫైనల్లో ప్రపంచ రెండో...

82వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను సీనియర్ స్టార్ సైనా నెహ్వాల్ గెలుచుకొంది. నాగపూర్ వేదికగా ముగిసిన ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ పీవీ సింధు ను వెటరన్ సైనా వరుస గేమ్ ల్లో చిత్తు చేసింది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన టైటిల్ సమరంలో సైనా 21-17, 27- 25తో సింధును కంగు తినిపించింది. 2006లో తొలిసారి జాతీయ టైటిల్ సాధించిన సైనా మరో టైటిల్ కోసం 11 సంవత్సరాలపాటు వేచి చూడాల్సి వచ్చింది. తొలిగేమ్ ను 21-17తో సొంతం చేసుకొన్న సైనా రెండో గేమ్ లో సింధు నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది. 18 పాయింట్ల స్కోరు నుంచి ఇద్దరూ నీకో పాయింట్ నాకో పాయింట్ అన్నట్లుగా పోరు సాగింది. చివరకు సైనా 27-25 పాయింట్లతో విజేతగా నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories