ధోని వేటుపై సచిన్‌ ఏమన్నాడంటే..

ధోని వేటుపై సచిన్‌ ఏమన్నాడంటే..
x
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్‌, మహేంద్ర సింగ్‌ ధోనిని టీ20ల నుంచి తప్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం అందరికి తెలిసిందే. కాగా ఈ విషయంపై ...

టీమిండియా మాజీ కెప్టెన్‌, మహేంద్ర సింగ్‌ ధోనిని టీ20ల నుంచి తప్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం అందరికి తెలిసిందే. కాగా ఈ విషయంపై సెలక్షన్‌ కమిటీ ఛీఫ్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలు ధోని టీ20 కెరీర్‌ ముగియలేదని స్పష్టంచేశారు. కాగా తాజాగా క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇదే అంశంపై స్పందిస్తూ, మీడియాతో సచిన్ మాట్లాడుతూ సెలక్టర్ల ఆలోచనేంటో అర్థం కావడం లేదని డ్రెస్సింగ్‌ రూంలో ఏం జరిగిందో తనకు తెలియదు కానీ, ఏ వ్యూహం, నిర్ణయాలు తీసుకున్న దేశానికి ఉపయోగపడేలా ఉండాలని టెండూల్కర్ స్పష్టం చేశాడు. దేశానికి ధోని చేసిన సేవలను సచిన్ కొనియాడాడు. ‘ఏం జరగబోతుంది.. ఎప్పుడు ఏం చేయాలనే’ విషయంపై మాజీ కెప్టెన్‌ కు తెలుసని సచిన్ అభిప్రాయపడ్డాడు. నేనెప్పుడు ఏ విషయంలోనూ నేను ఎలాంటి తీర్పులివ్వలేదు, ప్రస్తుత సెలక్టర్ల నిర్ణయంపై కూడా తీర్పునివ్వను. అన్ని ఫార్మాట్‌లో ధోని అద్భుతంగా రాణించాడు. కాని సెలక్టర్లు మాత్రం ధోనికి విశ్రాంతి ఇచ్చామని, ప్రత్యామ్నయ వికెట్‌ కీపర్‌ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. అభిమానులు మాత్రం ధోనిని తొలిగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories