రెహానా ఫాతిమాను వీడని కష్టాలు

శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగిని, ఉద్యమకారిణి రెహానా ఫాతిమాపై బదిలీ...
శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగిని, ఉద్యమకారిణి రెహానా ఫాతిమాపై బదిలీ వేటుపడింది. బోట్ జెట్టీ ప్రాంతం నుంచి పబ్లిక్ కాంటాక్ట్ అంతగా అవసరం లేని కొచ్చిలోని పలరివట్టం ఎక్ఛ్సేంజీకి బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆమె బోట్ జెట్టి బ్రాంచ్‌లో కస్టమర్ రిలేషన్ సెక్షన్‌లో టెలికాం టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. విధుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహించకపోయినప్పటికీ ఆమెను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
రెహానాను తొలగించాలంటూ శబరిమల కర్మ సమితి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించింది. అలాగే ముస్లిం కమ్యూనిటీ నుంచి ఆమెను తొలగించినట్లు కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ వెల్లడించింది. శబరిమల ఆలయంలో వెళ్లడానికి ప్రయత్నించినందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రెహానా ఇంటి మీద దాడి చేసి, ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఇతరుల మత సంప్రదాయాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిందని ఆమె మీద కేసు కూడా నమోదైంది. రెహానా కొంతకాలం మోడల్‌గానూ పనిచేశారు. మోరల్ పోలీసింగ్‌ను వ్యతిరేకిస్తూ 2014లో వచ్చిన ‘కిస్ ఆఫ్ లవ్’ అనే ఉద్యమంలో ఆమె కూడా భాగస్థులు. ఇప్పుడు రెహానాపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా బదిలీ చేయడాన్ని ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి.
గోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు కాల్స్..
9 Aug 2022 10:22 AM GMTJayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMT
ఈనెల 11న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలపై చర్చ..
9 Aug 2022 11:04 AM GMTNitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా
9 Aug 2022 10:49 AM GMTRashmika Mandanna: కష్టానికి అదృష్టం తోడైంది...
9 Aug 2022 10:39 AM GMTగోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు...
9 Aug 2022 10:22 AM GMTTelangana News: కన్నుల పండువగా.. ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ
9 Aug 2022 10:13 AM GMT