యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి దొంగల బీభత్సం

యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి దొంగల బీభత్సం
x
Highlights

యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దారిదోపిడీ జరిగింది. రైలు సిగ్నల్స్‌ను కట్ చేసిన దోపిడీ దొంగలు ప్రయణికులను బెదిరించి వారి నుంచి నగలు, నగదును...

యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దారిదోపిడీ జరిగింది. రైలు సిగ్నల్స్‌ను కట్ చేసిన దోపిడీ దొంగలు ప్రయణికులను బెదిరించి వారి నుంచి నగలు, నగదును దోచుకెళ్లారు. తెల్లవారుజమున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో దోపిడీ పాల్పడిన దొంగలు వారి నుంచి భారీగా బంగారు నగలను దోచుకున్నారు. వీరిని ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన వారిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితులు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ట్రైన్ మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత అటవీ ప్రాంతంలో ఆపి, దొంగలు రైల్లోకి చొరబడ్డారు. 5 నిమిషాల వ్యవధిలోనే ప్రయాణీకుల వద్ద నుంచి సుమారు 24 తులాల బంగారంతో పాటు 4 సెల్ ఫోన్లతో పాటు డబ్బును కూడా దోచుకుని పరారయ్యారు. పలువురు మహిళల మెడల్లోని బంగారు అభరణాలను తెంచుకుపోయే క్రమంలో వారి మెడకు తీవ్ర గాయలయ్యాయి.

దివిటి పల్లి వద్ద సిగ్నల్ ను కట్ చేసి, ట్రైయిన్ అపిన దొంగలు వెంటనే, రైలుపై రాళ్లదాడి చేయడంతో ఏం జరుగుతుందో తెలియని ప్రయాణీలు కిటికీలు తెరిచారు. దీంతో విండోల్లో నుంచే మహిళల మెడల ఉన్న చైన్లలను దోచుకెళ్లారు. కొందరు ప్రయాణీకులు వీరిని ప్రతిఘటించేందుకు ప్రయత్నించి ఫలితం లేకపోయింది. అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై కూడా దుండగులు దాడి చేసి, పరారయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories