logo
జాతీయం

వీడియో: మహిళా డాన్సర్‌తో చిందులేసిన ఆర్జేడీ నేత

X
Highlights

రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ (ఆర్జేడీ) నేత ఓ మహిళా డ్యాన్సర్‌తో చిందులేయడం వివాదాస్పదంగా మారింది. మహిళా...

రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ (ఆర్జేడీ) నేత ఓ మహిళా డ్యాన్సర్‌తో చిందులేయడం వివాదాస్పదంగా మారింది. మహిళా డాన్సర్‌తో చిందులేస్తూ ఆర్జేడీ నేత అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్‌జేడీ నాయకుడు అరుణ్ దాదుపురి ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అక్కడ ఓ బార్‌ డ్యాన్సర్‌ డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో దాదుపురి ఆమెతో చిందులేయడమే కాకుండా, కరెన్సీ నోట్లు చల్లుతూ, ఇష్టానుసారంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా ఆ డాన్సర్‌ను అమాంతం ఎత్తుకొని చిందేశాడు. ఈ నెల మార్చి 10 న బీహార్ గోపాల్గంజ్ జిల్లాలోని ఫతేపూర్‌లో ఓ వివాహ వేడుకలో రికార్డయిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అరుణ్ దాదుపురి ఆర్‌జేడీ పర్యవేక్షణ కమిటీలో సభ్యునిగా, ఫతేపూర్ బ్లాక్‌ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్‌జేడీ నాయకుడు అరుణ్ దాదుపురి ప్రవర్తన తమ పార్టీని తల దించుకునేలా చేసిందని పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

Next Story