Top
logo

‘లాకర్లు తెరిచేందుకు రేవంత్‌ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లిన ఐటీ అధికారులు’

X
Highlights

రేవంత్‌ రెడ్డి బ్యాంక్‌ అకౌంట్లపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. బ్యాంక్‌ లాకర్లు తెరిచేందుకు రేవంత్‌ భార్య...

రేవంత్‌ రెడ్డి బ్యాంక్‌ అకౌంట్లపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. బ్యాంక్‌ లాకర్లు తెరిచేందుకు రేవంత్‌ భార్య గీతను బ్యాంక్‌కు తీసుకెళ్లారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి తమ్ముడి బ్యాంక్‌ లాకర్లు పరిశీలించిన ఐటీ అధికారులు.. అదే బ్యాంక్‌లో రేవంత్‌రెడ్డికి చెందిన లాకర్లను ఓపెన్‌ చేయనున్నారు. రేవంత్ బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించడంతోపాటు రేవంత్ వియ్యంకుడు, ఓటుకు నోటు కేసులో ఉన్న సెబాస్టియన్, ఉదయసింహాల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించి నోటీసులు జారీ చేశారు. కాగా... ఇప్పటికే రేవంత్‌రెడ్డిపై బ్లాక్‌మనీ, ఐటీ, మనీ లాండరింగ్‌, ఫెమా, బినామీ లావాదేవీల చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Next Story