కొడంగల్‌ ఎన్నిక వాయిదా వేసేందుకు కుట్ర: రేవంత్

x
Highlights

సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్కే నగర్ తరహాలో కొడంగల్‌లో ఎన్నిక వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారనంటూ ఆయన ఆరోపించారు....

సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్కే నగర్ తరహాలో కొడంగల్‌లో ఎన్నిక వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారనంటూ ఆయన ఆరోపించారు. ఇందుకు డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీఐజీలే స్వయంగా సహకరిస్తున్నారంటూ రేవంత్ ఆరోపిస్తున్నారు. కొడంగల్‌ టీఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్‌ రెడ్డి ఫాంహస్‌లో గత రాత్రి ఐటీ దాడులు జరిగాయని ఇందులో 17 కోట్ల 51 లక్షల రూపాయలు వెలుగుచూడగా రూ. 51 లక్షల రూపాయలు మాత్రమే పట్టుకున్నట్టు లీకులిచ్చారని ఆరోపించారు. అక్కడ పట్టుబడిన డైరీలో 50 కోట్ల రూపాయల విలువైన లావాదేవీల వివరాలున్నాయని ఇందులో పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఎన్నికల అధికారులకు చేసిన చెల్లింపుల వివరాలు ఉన్నాయన్నారు. డబ్బు పట్టుబడిన విషయం తెలిసిన వెంటనే టీఆర్ఎస్‌ నేతలంతా రంగంలోకి దిగారని పీఎంవోలోని కీలక అధికారుల ద్వారా ఐటీ అధికారులపై ఒత్తిడి తెచ్చారంటూ ఆరోపించారు. వీరి సహకారంతో ఎన్నికల సంఘం అధికారులపై ఒత్తిడి తెచ్చి కేసు బయటకు రాకుండా చేశారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు . పోలీసుల సమక్షంలోనే నగదు భారీగా తరులుతోందంటూ విమర్శలు గుప్పించారు .

Show Full Article
Print Article
Next Story
More Stories