Top
logo

తెలంగాణ సర్కార్ యువతను గంజాయి, డ్రగ్స్ కు బానిసలుగా చేస్తోంది

X
Highlights

తెలంగాణ సర్కార్ యువతను గంజాయి, డ్రగ్స్ కు బానిసలుగా చేస్తోందన్నారు టీపీసీసీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట‌...

తెలంగాణ సర్కార్ యువతను గంజాయి, డ్రగ్స్ కు బానిసలుగా చేస్తోందన్నారు టీపీసీసీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట‌ రేవంత్ రెడ్డి. క్రీడలు జరిగే గచ్చిబౌలి స్టేడియంలో ఇవాళ జరిగే సెన్సేషన్ రైజ్ ఈవెంట్ ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈవెంట్ పేరుతో లిక్కర్ సరఫరా జరుగబోతోంది ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్లు మూసుకున్నారా అని రేవంత్ ధ్వజమెత్తారు. ఈవెంట్ పై ఎన్నికల అధికారి రజత్ కుమార్ విచారణకు ఆదేశించాలని కోరారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాకా రాష్ట్రంలో ఒక్క స్పోర్ట్స్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేయలేదు.. కానీ స్టేడియంలో మాత్రం తాగుబోతుల ఈవెంట్ కు అనుమతి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story