పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రేణూ దేశాయ్

x
Highlights

గత జ్ఞాపకాలని వదిలేసి..కొత్త జీవితం వైపు అడుగులేస్తోంది..రేణు దేశాయ్. తన జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడని..చెప్పకనే చెబుతోంది. మళ్లీ ప్రేమలో...

గత జ్ఞాపకాలని వదిలేసి..కొత్త జీవితం వైపు అడుగులేస్తోంది..రేణు దేశాయ్. తన జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడని..చెప్పకనే చెబుతోంది. మళ్లీ ప్రేమలో పడ్డానని..అల్లిబిల్లి ఊసులు పంచుకుంటోంది. కాబోయే..జీవిత భాగస్వామిపై అందమైన కవితలతో రేణూ దేశాయ్‌ ప్రేమ కురిపిస్తుంది. ప్రియుడి ప్రేమలో రేణూ పరవశించిపోతోంది. మొన్నటిదాకా గతాన్ని నెమరేసుకుంటూ భావోద్వేగంతో కవితలు రాసిన రేణుదేశాయ్..ఇప్పుడు ప్రేమ కవిత్వంలో పులకించిపోతుంది. కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు సిద్దమవుతోంది. కాబోయే..శ్రీవారిపై..రేణు తెగ ప్రేమ ఒలకబోస్తుంది.

గ‌తంలోనే త‌న‌కి ఓ తోడు కావాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపింది రేణూ. కానీ..లవ్ మ్యారేజ్, సినిమా, పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తిని అస్సలు పెళ్లి చేసుకోనని చెప్పింది. రీసెంట్ గా..త‌న‌కు కాబోయే భ‌ర్త చేయిప‌ట్టుకుని ఉన్న ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి..మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని రేణు కన్ఫామ్ చేసింది. ఫోటో పాటుగా తన స్టైల్ లో కవిత్వం కూడా రాసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటో ద్వారా..రేణుదేశాయ్ తనకు కాబోయే భ‌ర్త గురించి చిన్న హింట్ ఇచ్చింది. అయితే..ఇప్పుడు ఇంకాస్త డీటైల్‌గా ఈ విష‌యంపై క్లారిటీ వ‌చ్చింది. ప్ర‌స్తుతం త‌న పిల్ల‌లు, ఫ్రెండ్స్‌తో క‌లిసి గోవా టూర్ లో ఎంజాయ్ చేస్తున్న రేణూ..త‌న స్నేహితులు కాబోయే భ‌ర్త పంపిన మెసేజ్‌లు చ‌దివే ప్రైవ‌సీ ఇవ్వ‌డం లేదంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్ పెట్టింది. అంతే కాదు తాను స్విమ్ డ్రెస్‌లో ఫోన్ చూస్తున్న‌ప్పుడు తీసిన ఫోటోని కూడా షేర్ చేసింది. మొత్తానికి..తనకో తోడు దొరికిందని..త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పకనే చెప్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories