రేణూదేశాయ్.. పవన్ కల్యాణ్.. మధ్యలో ఫ్యాన్స్!

రేణూదేశాయ్.. పవన్ కల్యాణ్.. మధ్యలో ఫ్యాన్స్!
x
Highlights

పవన్ కల్యాణ్ తో వైవాహిక బంధానికి దూరమైన తర్వాత కూడా.. రేణూదేశాయ్ పవన్ ను మరిచిపోలేకపోయింది. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. అప్పుడప్పుడూ ట్వీట్లతో...

పవన్ కల్యాణ్ తో వైవాహిక బంధానికి దూరమైన తర్వాత కూడా.. రేణూదేశాయ్ పవన్ ను మరిచిపోలేకపోయింది. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. అప్పుడప్పుడూ ట్వీట్లతో కూడా.. పవన్ పై తన అభిమానాన్ని రేణూ కురిపించడం కూడా చూశాం. పవన్ గురించో కాదో కానీ.. ఆ మధ్య ఓ కవిత కూడా పోస్ట్ చేసింది. ఇదే.. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ లో అసహనం పెంచింది. ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతుంటే.. పవన్ అందరికీ టార్గెట్ అవుతున్నాడని.. విద్యాసాగర్ అనే అభిమాని రేణూదేశాయ్ పై సీరియస్ అయ్యాడు.

దీంతో.. అంతే సీరియస్ గా స్పందించిన రేణూ దేశాయ్.. ఎవరి పని వారు చూసుకుంటే మంచిదని కామెంట్ చేసింది. తాను చేసిన పోస్ట్.. పవన్ ను ఎలా టార్గెట్ చేస్తుందని ప్రశ్నించింది. సంస్కారం లేకుండా పోస్టులు పెట్టవద్దని ఘాటుగా స్పందించింది. ఈ ట్వీట్ ను కూడా జనాలు రాద్ధాంతం చేస్తారని తెలుసని కూడా ఓ మాట అనేసింది.

దీంతో.. రేణూదేశాయ్ ఆగ్రహాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా చూస్తున్నారు. ఆమె అన్నదాంట్లో తప్పేమీ లేదన్నవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories