పవన్ కల్యాణ్ ను కొంపముంచింది ఆ ఒక్కటే

ఎక్స్ పెక్టేషన్స్..ఈ పదానికి చాలా పవర్ ఉంది. సినిమాను నిలెబెట్టాలన్నా..పడగొట్టాలన్నా దీనికే సాధ్యం. అంచనాలను...
ఎక్స్ పెక్టేషన్స్..ఈ పదానికి చాలా పవర్ ఉంది. సినిమాను నిలెబెట్టాలన్నా..పడగొట్టాలన్నా దీనికే సాధ్యం. అంచనాలను అందుకుంటే బ్లాక్ బస్టర్ చేస్తోంది. అదే ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ కాకపోతే నిట్ట నిలువునా ముంచేస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసికి అలాంటి షాకింగ్ న్యూసే ఎదురైంది. సినిమాకు నెగిటీవ్ టాక్ రావడానికి కారణమేంటో ఓసారి చూడండి.
పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే మామూలుగా బోలెడన్నీ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అవుతుంది. మరి అలాంటి పవన్ కు త్రివిక్రమ్ తోడైతే సినిమాపై అంచనాలు ఇంకేరేంజ్ లో ఉంటాయో ఊహించొచ్చు. సరిగ్గా అజ్ఞాతవాసి పై కూడా ఎక్స్ పెక్టేషన్స్ తారా స్థాయికి చేరాయి. అందుకే రిలీజ్ కు ముందే పలు రికార్డును సొంతం చేసుకుంది. ఒవర్సిస్ లో 570అత్యధిక లోకేషన్స్ లో రిలీజైన ఫస్ట్ ఇండియన్ మూవీగా ఘనత సాధించింది. అంతేకాదు ఓవర్సిస్ లో ఓపెనింగ్స్ తోనే 1.5మిలియన్ డాలర్స్ రాబట్టి...బాహుబలి తర్వాత అత్యధిక ఓపెనింగ్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ఓపెనింగ్ తెచ్చిపెట్టడంలో భారీ ఎక్స్ పెక్టేషన్స్ హెల్ప్ ఐనా..అవే సినిమా కొంపముంచాయి.
పవన్ మానియాకు..త్రివిక్రమ్ మేకింగ్ తోడవ్వడంతో అజ్ఞాతవాసిని ఓ రేంజ్ లో ఊహించుకున్నారు ఆడియన్స్. అజ్ఞాతవాసితో పవన్, త్రివిక్రమ్ మరోసారి మ్యాజిక్ చేస్తారనుకున్నారంతా. కానీ ఆ భారీ అంచనాలే సినిమాను దెబ్బ తీశాయి. ప్రేక్షకులు ఊహించిన రేంజ్ ను సినిమా రీచ్ కాలేకపోయింది. దీంతో సినిమా ఫలితం తారుమారు ఐంది. మొదటి నుంచే సినిమాకు నెగిటీవ్ టాక్ వచ్చింది. అజ్ఞాతవాసిలో యాక్టింగ్ తో పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో చేసినా..కథలో బలం లేకపోవడమే సినిమా ఫలితాన్ని రివర్స్ చేసింది. సినిమాకు ప్రాణమైన కథను దర్శకుడు త్రివిక్రమ్ కొత్తగా చూపించలేకపోయాడు. అత్తారింటికి దారేది సినిమానే మరోసారి గుర్తుకు చేసేలా ఉంది. ఎంత ఫ్యాన్స్ ఐనా ఒక్క సినిమాను ఒకేసారి చూస్తారు. కానీ త్రివిక్రమ్ అత్తారింటికి దారేది సినిమా ఛాయల్సి...అజ్ఞాతవాసిలోను చూపించాడు. కథ, కథనంపై ఇంకాస్త కేర్ తీసుకుంటే బావుండేది. పైగా త్రివిక్రమ్ మార్క్ గా చెప్పుకునే పంచ్ కామెడీలు పెద్దగా సందడి చేయలేదు.
అజ్ఞాతవాసి మూవీ పస్టాఫ్ లో ఇంటర్వేల్ బ్యాంగ్ తప్పా..పెద్దగా ఇంట్రెస్ట్ గా తీర్చిదిద్దలేకపోయాడు. సెకండాఫ్ లో 20మినిట్స్ కామెడీ సీన్, క్లైమాక్స్ సీన్ సినిమాకు నెట్టుకొచ్చాయి. అజ్ఞాతవాసిపై ముందు నుంచి నెలకొన్న భారీ అంచనాలే సినిమాను ముంచేశాసి. ప్రేక్షకులు సినిమాను ఓ రేంజ్ లో ఊహించుకోవడం..సినిమా వారి ఎక్స్ పక్టేషన్స్ ను రీచ్ కాకపోవడం మూవీని దెబ్బ తీశాయి. ఒకవేళ సినిమాపై ఈ రేంజ్లో అంచనాలు లేకపోతే హిట్ అయ్యేదేమో. మొత్తానికి పవన్, త్రివిక్రమ్ మ్యాజిక్ ఈ సారి వర్కౌట్ కాలేదు.
హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMTవయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
1 July 2022 12:30 PM GMT'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMT
Bandi Sanjay: ఒక్క కుటుంబం చేతుల్లో తెలంగాణ నలిగిపోతోంది
3 July 2022 11:00 AM GMTPiyush Goyal: కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి
3 July 2022 10:49 AM GMTTelangana: ఖరీఫ్ సీజన్లో పత్తి, మిర్చి సాగుపై రైతుల ఆసక్తి
3 July 2022 10:45 AM GMTకాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో నష్టపోతున్న రైతులు
3 July 2022 10:22 AM GMTప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
3 July 2022 10:00 AM GMT