logo
జాతీయం

కీలక వడ్డీ రేట్లు పెంచిన ఆర్‌బీఐ

కీలక వడ్డీ రేట్లు పెంచిన ఆర్‌బీఐ
X
Highlights

రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా... నాలుగున్నర ఏళ్లలో తొలిసారిగా కీలక వడ్డీ రేట్లు పెంచింది. కీలక వడ్డీరేట్లను...

రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా... నాలుగున్నర ఏళ్లలో తొలిసారిగా కీలక వడ్డీ రేట్లు పెంచింది. కీలక వడ్డీరేట్లను పావు శాతం పెంచుతూ ఆర్‌బీఐ... పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో ద్వైమాసిక పరపతి విధాన సమావేశం... ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ఎంపీసీ మూడు రోజుల పాటు జరిగింది. ఈ సమావేశంలో కీలక వడ్డీరేట్లను పావుశాతం పెంచాలని ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఆర్‌బీఐ నిర్ణయం ప్రకారం... ప్రస్తుతం 6 శాతంగా ఉన్న రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. రివర్స్‌ రెపో రేటు 5.75 శాతం నుంచి 6 శాతానికి పెంచారు. ద్రవ్యోల్బణ భయాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటమే రేట్ల పెంపునకు కారణమని భావిస్తున్నారు. అయితే ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచడం నాలుగున్నరేళ్లలో ఇదే తొలిసారి. చివరి సారిగా జనవరి 2014లో రెపో రేటును 8 శాతానికి పెంచింది. ఆ తర్వాత రేట్లను తగ్గించడం లేదా యథాతథంగా ఉంచుతూ వస్తోంది.

Next Story