కీచకులుగా మారిన సహచరులు..నన్నే పెళ్లి చేసుకోవాలి అంటూ..

కీచకులుగా మారిన సహచరులు..నన్నే పెళ్లి చేసుకోవాలి అంటూ..
x
Highlights

తననే పెళ్లి చేసుకోవాలంటూ, తోటి అధ్యాపకురాలిని లైంగికంగా వేధిస్తున్న ముగ్గురు ప్రొఫెసర్ల ఉదంతం బయటపడటం కర్నూలులోని రాయలసీమ యూనివర్శిటీలో కలకలం...

తననే పెళ్లి చేసుకోవాలంటూ, తోటి అధ్యాపకురాలిని లైంగికంగా వేధిస్తున్న ముగ్గురు ప్రొఫెసర్ల ఉదంతం బయటపడటం కర్నూలులోని రాయలసీమ యూనివర్శిటీలో కలకలం రేపుతోంది. అవివాహితురాలైన ఓ యువతి, మెరిట్ పై కాంట్రాక్టు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా 2017 జూలైలో ఉద్యోగంలో చేరారు. ఆమెను చూసి మోహించిన ముగ్గురు తోటి ప్రొఫెసర్లు, తనను పెళ్లి చేసుకోవాలంటే, తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత అధ్యాపకురాలు.. ఉద్యోగం వదలిపోతున్నట్టు సన్నిహితులతో చెప్పి వాపోయారు. ఈ విషయాన్ని వర్సిటీ ఉన్నతాధికారులకు చెప్పాలని, తాము కూడా తోడుంటామని వారు చెప్పారు. ఇందుకోసం సోమవారం ఆమె వెళుతుండగా.. దారిలోనే స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే వి‍ద్యార్థులు, అధ్యాపకులు ఆమెను కర్నూలులోని ఓ ఆస్పత్రికి తరలించారు.

అధ్యాపకురాలిని వేధించిన వారిపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా అందింది. అయినా చర్యలు తీసుకోలేదు. సంజాయిషీ కూడా కోరకపోవడంతో వీరు మరింత రెచ్చిపోయి.. అధ్యాపకురాలిని లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై విచారణ జరుపుతామని, వేధింపులు నిజమైతే బాధ్యులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని రిజిస్ట్రార్‌ అమర్‌నాథ్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories