Top
logo

అశ్విన్‌ సరికొత్త రికార్డు

Highlights

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 300 వికెట్లు సాధించిన బౌలర్...

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 300 వికెట్లు సాధించిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. డెన్నిస్ లిల్లీ, ముత్తయ్య మురళీధరన్ ల పేరుతో ఉన్న రికార్డులను అధిగమించాడు. నాగపూర్ విదర్భ స్టేడియం వేదికగా శ్రీలంకతో ముగిసిన రెండోటెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ 4 వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ ఘనత సొంతం చేసుకొన్నాడు. మ్యాచ్ మొత్తంలో ఎనిమిది వికెట్లు పడగొట్టడం ద్వారా అశ్విన్ తానేమిటో నిరూపించుకొన్నాడు. తన కెరియర్ లో ఇప్పటి వరకూ 54 టెస్టులు ఆడిన అశ్విన్ 26 సార్లు 5 వికెట్లు, ఏడుసార్లు 10 వికెట్ల రికార్డులు సైతం సాధించాడు.

Next Story