logo
సినిమా

ఆ విషయం సీఎంను అడగండి: రవితేజ

ఆ విషయం సీఎంను అడగండి: రవితేజ
X
Highlights

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు వ‌రుస సినిమాలు చేస్తున్నాడు....

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్‌గా రాజా ది గ్రేట్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ర‌వితేజ అంధుడిగా ఎంత‌గానో అల‌రించాడు. ఇక విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ట‌చ్ చేసి చూడు చిత్రంతో ఫిబ్ర‌వ‌రి 2న థియేట‌ర్స్‌లోకి రానున్నాడు. ఈ సంద‌ర్భంగా చిత్రానికి సంబంధించి ప‌లు విశేషాలు తెలియ‌జేశాడు. రవితేజ ట్విటర్‌ వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర ప్రశ్నలకు ‘మాస్‌మహారాజా’ ఈ విధంగా సమాధానాలు ఇచ్చారు.

ప్రశ్న: మీ అభిమాన బాలీవుడ్‌ నటుడు?

రవితేజ: అమితాబ్‌ బచ్చన్‌

రాజమౌళితో మళ్లీ ఎప్పుడు నటిస్తారు?

త్వరలో..

విలన్‌ పాత్రలో నటిస్తారా?

నటించాలనే ఉంది.

టాలీవుడ్‌లో ఏ హీరో అంటే ఇష్టం?

రవితేజ

‘టచ్‌ చేసి చూడు’ ఎలా ఉండబోతోంది?

యాక్షన్‌, కామెడీగా ఉంటుంది

అమరావతి అభివృద్ధి గురించి మూడు ముక్కల్లో చెప్పండి..

ఆ విషయం చంద్రబాబును అడగండి.

మీ నుంచి మల్టీస్టారర్‌ ఆశించవచ్చా?

తప్పకుండా. కానీ మంచి స్క్రిప్ట్‌ దొరకాలి.

కథ నచ్చితే నిర్మాతగా వ్యవహరిస్తారా?

నేను నటుడిని.

‘వెంకీ’ లాంటి సినిమా కావాలి

నా సినిమాలను ఫాలో అవుతూ ఉండండి

ఎందుకు అంత సన్నగా అయిపోయారు?

సన్నగా అయితే సన్నగా అయ్యావ్‌ అంటారు. లావైతే లావైపోయావ్‌ అంటారు.

క్రీడలంటే ఇష్టమా?

చాలా. కానీ ఏ క్రీడ ఇష్టం అని మాత్రం అడగొద్దు

శ్రీను వైట్లతో సినిమా ఎప్పుడు మొదలవుతుంది?

ఈ నెలలోనే

గెడ్డంతో ఉన్న పాత రవితేజను మళ్లీ ఎప్పుడు చూస్తాం?

సినిమాలో పాత్రను బట్టి ఉంటుంది.

పూరీ జగన్నాథ్‌తో సినిమా ఎప్పుడు?

త్వరలో..

అట్లీ, మురుగదాస్‌ లాంటి కమర్షియల్‌ దర్శకులతో ఎప్పుడు సినిమా చేస్తారు?

వాళ్లు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు చేస్తాను.

సిక్స్‌ ప్యాక్‌ లుక్‌ ఎప్పుడు చూపిస్తావ్‌?

దానికి ఇంకా టైముంది

వంట వచ్చా?

అస్సలు రాదు

‘అ’ సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడానికి కారణం?

నాని నాకు మంచి స్నేహితుడు. ఇందులో ఓ పాత్రకు నా వాయిసే కావాలన్నాడు. అందుకే ఒప్పుకున్నాను.

త్రిపాత్రాభినయం చేస్తున్నారట?

సినిమా చూస్తారుగా..మీకే తెలుస్తుంది.

‘రాజా ది గ్రేట్‌’కు సీక్వెల్‌ ఉంటుందా?

దిల్‌రాజు, అనిల్‌ రావిపూడిని అడగండి. (ఇంతలో అనిల్‌ రావిపూడి రవితేజకు ట్వీట్‌ చేస్తూ..‘మహారాజ్‌..మీరు ఎప్పుడంటే అప్పుడే సీక్వెల్‌ చేద్దాం’) అన్నారు.

రామ్‌గోపాల్‌ వర్మ, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తే చూడాలని ఉంది

ఇద్దరితో కలిసి ఒకే సినిమా అయితే చేయలేము కదా..చేద్దాం

అన్నింటికంటే మీరు ఎక్కువగా భయపడేది?

భయానికి

స్టార్‌ హీరో చిత్రంలో నెగిటివ్‌ క్యారెక్టర్‌ చేస్తారా?

స్క్రిప్ట్‌ మీద ఆధారపడి ఉంటుంది

మహాధన్‌ తరువాతి సినిమా ఏంటి?

వాడిని ఒంటరిగా వదిలేయండి

మరోసారి చిరుతో కలిసి మీరు పనిచేయాలి

తప్పకుండా చేస్తాను

సినిమా హిట్‌ అయితే తిరుమలకు వస్తారా?

హిట్‌ అయినా అవ్వకపోయినా తిరుమలకు వస్తాను కదా? అలా అడుగుతారేంటి?

ఇండస్ట్రీలో ఏ హీరోయిన్‌ని అయినా ప్రేమించారా?

అబ్బాఛా....

తారక్‌, చరణ్‌ చిత్రంలో విలన్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారా?

ఏవేవో ఊహించేసుకోవద్దు. కానీ ఐడియా బాగానే ఉంది.

Next Story