పందిపిల్లతో ఫిట్‌నెస్‌ చాలెంజ్‌

పందిపిల్లతో ఫిట్‌నెస్‌ చాలెంజ్‌
x
Highlights

నటుడు, దర్శకుడు అయిన రవిబాబు తన డైరెక్షన్‌లోనే ‘ అదుగో ‘ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. ఈ సినిమాలో బంటి అనే పందిపిల్ల ప్రత్యేక ఆకర్షణ...

నటుడు, దర్శకుడు అయిన రవిబాబు తన డైరెక్షన్‌లోనే ‘ అదుగో ‘ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. ఈ సినిమాలో బంటి అనే పందిపిల్ల ప్రత్యేక ఆకర్షణ అట.. ఆ మధ్య దీనికి పళ్ళు తోముతూ కనిపించిన రవిబాబు తాజాగా దానితో కలిసి కసరత్తులు చేశాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఫిట్‌నెస్ చాలెంజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఈ సందర్భాన్ని తన సినిమా ప్రచారానికి వినియోగించుకున్న రవిబాబు. బంటీ(పందిపిల్ల)తో కలిసి కసరత్తులు చేస్తున్న వీడియోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేశారు. పందిపిల్లను వీపుపై ఎక్కించుకుని పుల్‌అప్స్‌ చేశారు. ‘ బంటి ఫిట్‌నెస్‌ కోసం వ్యాయామం చేయగలుగుతోందని, మరి మీరు ఎందుకు చేయర’ని ప్రశ్నించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories