సెలబ్రిటి రిసార్టులో అశ్లీలం తాండవం

x
Highlights

హైదరాబాద్ నగర శివారులో రేవ్ పార్టీ కల్చర్ పెరిగిపోయింది. షామీర్ పేటలోని ఓ రిసార్టులో అర్ధరాత్రి యువతులతో కలిసి కొందరు డాక్టర్లు అసాంఘీక కార్యకలాపాలకు...

హైదరాబాద్ నగర శివారులో రేవ్ పార్టీ కల్చర్ పెరిగిపోయింది. షామీర్ పేటలోని ఓ రిసార్టులో అర్ధరాత్రి యువతులతో కలిసి కొందరు డాక్టర్లు అసాంఘీక కార్యకలాపాలకు తెరలేపారు. ఓ బడా ఫార్మా కంపెనీ యువతులను తీసుకు వచ్చి నృత్యాలు చేయిస్తూ మద్యం మత్తులో మగువలతో పాటు చిందులు వేశారు. రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లాలో షామీర్ పేటలోని సెలబ్రిటి రిసార్టులో అశ్లీలం తాండవించింది. కొందరు హైప్రొపైల్ డాక్టర్లు మద్యం మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. వీకెండ్ కావడంతో మిత్రులతో కలిసి సరదాగా పార్టీ చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అమ్మాయిలను పిలిపించుకుని రేవ్ పార్టీలో మునిగిపోయారు. రేవ్ పార్టీ చట్ట వ్యతిరేకం అని తెలిసినా సైలెంట్ గా పని కానిచ్చేద్దామనుకున్న డాక్టర్లు మందు, మగువ మత్తులో చిందులు వేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

సెలబ్రిటీ రిసార్ట్ పై దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు భారీగా మద్యం, కండోమ్ పాకెట్లతో పాటు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించడానికి వాడే మెడికల్ కిట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో గజ్వేల్ కు చెందిన ఆరుగురు, హైదరాబాద్ సిటికి చెందిన ఇద్దరు. ముంబైయికి చెందిన యువతితో పాటు నగరానికి చెందిన మరో ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన డాక్టర్లంతా గజ్వెల్ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో పట్టుబడిన యువతులను బలవంతంగా తీసుకువచ్చినట్లు సైబరాబాద్ షీటీం బృందం తెలిపింది. తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకే ఓ ఫార్మా కంపెనీకి చెందిన కొందరు రీసార్ట్ కు అమ్మాయిలను తరలించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీ రిసార్ట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories