గ్రహణాలపై ఎన్నో నమ్మకాలు, మరెన్నో ప్రచారాలు

x
Highlights

గ్రహణం..ఈ పేరు వింటే చాలా మందికి భయం సూర్య గ్రహణమో చంద్ర గ్రహణమో వస్తుందంటే మనదేశంలో ఎన్నో ఆచారాలు, మూఢ నమ్మకాలు తెరపైకి వస్తుంటాయ్. గ్రహణం పట్టి...

గ్రహణం..ఈ పేరు వింటే చాలా మందికి భయం సూర్య గ్రహణమో చంద్ర గ్రహణమో వస్తుందంటే మనదేశంలో ఎన్నో ఆచారాలు, మూఢ నమ్మకాలు తెరపైకి వస్తుంటాయ్. గ్రహణం పట్టి విడచిన తర్వాత కూడా చాలా మంది ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతుంటారు. మన దేశంలోనే కాదు గ్రహణాల గురించి ఇతర దేశాల్లోనూ అనేక విశ్వాసాలున్నాయి.

గ్రహణాల సమయంలో అనేక నమ్మకాలు , ఆచారాలు ప్రచారంలోకి వస్తుంటాయి. గర్భిణులు గ్రహాణాన్ని చూడ కూడదని, గ్రహణ సమయంలో ఏమీ తినకూడదని మన దేశంలో చాలా మంది నమ్ముతారు. అయితే అమెరికన్లు మాత్రం సూర్య, చంద్ర గ్రహణాలను జీసస్ రాకకు సూచికగా భావిస్తారు. సూర్యుడు అస్సలు కనిపించకుండా పోవడం చంద్రుడు బ్లడ్ మూన్‌గా మారిపోవడం ఏసుక్రీస్తు రెండో రాకడకు గుర్తుగా చూస్తారు. ఇక దక్షిణాప్రికా ప్రజలు మాత్రం గ్రహణాలను సూర్య చంద్రుల మధ్య జరిగే యుద్ధంగా చూస్తారు. సూర్యుడు చంద్రుడి మధ్య విభేదాలు తొలగి పోవాలని సౌతాఫ్రికన్లు దేవుణ్ణి ప్రార్థిస్తారు. అలాగే టిబెట్‌లో చెడు మంచికి ప్రతీకగా గ్రహణాలను చూస్తారు. ఇంకొందరైతే సుదీర్ఘ సంపూర్ణ సూర్య, చంద్ర గ్రహాణాల తర్వాత ప్రపంచం అంతమవుతుందని నమ్ముతారు.

మనదేశంలో చంద్ర గ్రహణం సమయంలో చాలా మంది ఏమీ తినరు, తాగరు. అసలు వంట చేయడమే మానేస్తారు. చంద్ర గ్రహణం సమయంలో వంట చేయడాన్ని తినడాన్ని కీడుగా భావిస్తారు. గ్రహణం పట్టే 3, 4 గంటల ముందే ఘన పదార్ధాలు, భోజనాలు తినాలనేది పెద్దల మాట. అంతేకాదు సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని గర్భిణులు, చిన్న పిల్లలు ప్రత్యక్షంగా చూడకూడదనీ వారు కదలకుండా పడుకోవాలనీ మనస్సులో భగవంతుని ధ్యానిస్తూ ఉండాలని చెబుతుంటారు.


అంతేకాదు గ్రహణం సమయంలో మన దేశంలో హిందూ ఆలయాలను మూసివేస్తారు. లోకానికి వెలుగు, వేడిని ప్రసాదించే సూర్యచంద్రులను క్రూర గ్రహాలైన రాహుకేతువులు మింగుతాయి కాబట్టి దేవాలయాలను గ్రహణ కాలంలో మూసివేస్తారు. గ్రహణం వీడిన తరువాత శుద్ధి చేసి పూజాదికాలు ప్రారంభిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories