logo
సినిమా

పెళ్లి చేసుకోకు.. పిల్ల‌ల్ని మాత్రం క‌ను: రాణీ ముఖర్జీ

పెళ్లి చేసుకోకు.. పిల్ల‌ల్ని మాత్రం క‌ను: రాణీ ముఖర్జీ
X
Highlights

సల్మాన్‌ ఖాన్‌ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఎప్పటినుంచో బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన ప్రశ్న ఇది....

సల్మాన్‌ ఖాన్‌ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఎప్పటినుంచో బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన ప్రశ్న ఇది. ప్ర‌పంచంలో అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ల‌భిస్తున్నాయి.. కానీ, స‌ల్మాన్ ఖాన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడ‌నే దానికి మాత్రం జ‌వాబు దొర‌క‌డం లేద‌ని చాలా మంది స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తుంటారు. దాదాపు ద‌శాబ్ద కాలం నుంచి స‌ల్మాన్ ఖాన్ పెళ్లి గురించి వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా స‌ల్మాన్ పెళ్లి గురించి బాలీవుడ్ వెట‌ర‌న్ హీరోయిన్ రాణీ ముఖ‌ర్జీ ఆస‌క్తిక‌రంగా స్పందించింది.రాణి ప్రధాన పాత్రలో నటించిన ‘హిచ్‌కీ’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా సల్మాన్‌ వ్యాఖ్యాతగా నటిస్తున్న ‘బిగ్‌బాస్‌11’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సల్మాన్‌ పెళ్లి గురించి రాణి మాట్లాడుతూ.. ‘సల్మాన్‌ పెళ్లి చేసుకోకూడదు. కేవలం పిల్లల్ని మాత్రమే కనాలి. అప్పుడు నా కూతురు అదీరా ఆడుకోవడానికి ఓ తోడు దొరుకుతుంది. సల్మాన్‌కి కలిగే పిల్లలు అచ్చం అతనిలాగే అందంగా ఉండాలి.’ అని చెప్పారు. రాణి, సల్మాన్‌ జోడీగా ‘బాబుల్‌’ సినిమాలో నటించారు. రాణి నటించిన ‘హిచ్‌కీ’ సినిమాకు సిద్దార్థ్‌ పి.మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Next Story