రివ్యూ: రంగస్థలం

రివ్యూ: రంగస్థలం
x
Highlights

చిత్రం: రంగస్థలం నటీనటులు: రామ్‌చరణ్‌.. సమంత.. ఆది.. ప్రకాశ్‌రాజ్‌.. జగపతిబాబు.. అనసూయ.. నరేష్‌.. రోహిణి.. రాజీవ్‌ కనకాల తదితరులు సంగీతం: దేవిశ్రీ...

చిత్రం: రంగస్థలం
నటీనటులు: రామ్‌చరణ్‌.. సమంత.. ఆది.. ప్రకాశ్‌రాజ్‌.. జగపతిబాబు.. అనసూయ.. నరేష్‌.. రోహిణి.. రాజీవ్‌ కనకాల తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు
కూర్పు: నవీన్‌ నూలి
కళ: రామకృష్ణ, మౌనిక
పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌
సాహిత్యం: చంద్రబోస్‌
రచన: తోట శ్రీనివాస్‌.. కాశీ విశాల్‌.. బుచ్చిబాబు.. శ్రీనివాస్‌ రంగోలి
నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని.. వై. రవిశంకర్‌.. మోహన్‌ చెరుకూరి
దర్శకత్వం: సుకుమార్‌
బ్యానర్‌: మైత్రీ మూవీ మేకర్స్‌
విడుదల: 30-03-2018
సమ్మర్ రేస్‌లో దమ్ము చూపేందుకు ‘రంగస్థలం’ మూవీతో దూసుకొచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. సుకుమార్ దర్శకత్వంలో సమంతతో కలిసి జతకట్టిన రామ్ చరణ్.. ఈ మూవీలో తన నట విశ్వరూపం చూపాడని మెగాఫ్యాన్స్‌నుండి వినిపిస్తున్నమాట. అత్యంత భారీ అంచనాలతో సుమారు 1700 థియేటర్స్‌లో శుక్రవారం నాడు భారీగా విడుదలైంది ‘రంగస్థలం’. సుమారు ఏడాది తరువాత వస్తున్న రామ్ చరణ్ మూవీ కోసం గురువారం అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. అన్ని థియేటర్లలోనూ ఉదయం 5 గంటలకే షోలు స్టార్ట్ కాగా.. ఓవర్సీస్‌లో నిన్న రాత్రే స్పెషల్ ప్రిమియర్ షోలు పడటంతో చిట్టిబాబు, రామలక్ష్మిల నటనకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. సుకుమార్ టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, చిట్టిబాబుకి అన్నగా ఆది నటన, ప్రతినాయకుడిగా జగపతిబాబు ఉగ్రరూపం, ప్రకాష్ రాజ్ సహజశైలి వెరసి.. ‘రంగస్థలం’ థియేటర్స్‌లో అభిమానులు విజయోత్సవాలను జరుపుకుంటున్నారు.

కథేంటంటే: రంగస్థలం అనే గ్రామానికి ప్రెసిడెంట్‌ ఫణీంద్ర భూపతి(జగపతిబాబు). 30ఏళ్లుగా ప్రెసిడెంట్‌ పదవిలో ఉంటాడు. మరొకరికి అవకాశం ఇవ్వడు. గ్రామంలో అతను చెప్పిందే వేదం. అతని పేరు పలకడానికి కూడా జనం భయపడుతుంటారు. ప్రెసిడెంట్‌ ఇంటి ముందు నుంచి వెళ్లాలన్నా చెప్పులు విడిచి వెళ్లాలి. ఇదే గ్రామంలో పొలాలకు నీరు పెట్టే ఇంజిన్‌ను నడుపుతూ ఉంటాడు చిట్టిబాబు(రామ్‌ చరణ్‌). అతడికి చెవుడు. పెద్దగా వినిపించదు. గ్రామంలో అందరితోనూ సరదాగా ఉంటాడు. తండ్రి(నరేష్‌) గ్రామంలో దర్జీ. అన్న కుమార్‌బాబు(ఆది) చదువుకుని దుబాయ్‌లో ఉద్యోగం చేసి వస్తాడు. అదే ఊరిలో ఉండే రామలక్ష్మి(సమంత)కి చిట్టిబాబు అంటే ఎంతో ఇష్టం. గ్రామంలోని అమాయక రైతులను తన సహాయకుడితో కలిసి ఫణీంద్రభూపతి మోసం చేస్తూ ఉంటాడు. అలా రామలక్ష్మి(సమంత) తండ్రిని మోసం చేసి డబ్బు కట్టాల్సిందిగా ఆదేశిస్తాడు. ఈ విషయంలో కుమార్‌బాబుకి ప్రెసిడెంట్‌ సహాయకుడికి మధ్య గొడవ జరుగుతుంది. మరి ఆ గొడవ దేనికి కారణమైంది? ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? ‘రంగస్థలం’ గ్రామ సర్పంచ్‌ ఎన్నికల్లో కుమార్‌బాబు ఎందుకు నామినేషన్‌ వేయాల్సి వచ్చింది? తన అన్నకు అండగా నిలిచిన చిట్టిబాబు ఏం చేశాడు? అన్నదే కథ.

ఎలా ఉందేంటే: ఇది 1985 నాటి కాలంలో సాగే కథ. భూస్వామ్య వ్యవస్థ.. ఒకే వ్యక్తి చేతిలో అధికారం ఉండటం.. 30ఏళ్లుగా గ్రామాన్ని పాలిస్తున్న ఓ ప్రెసిడెంట్‌ చేసే అరాచకాలను నిలదేసే ఓ యువకుడు.. ఇదీ స్థూలంగా రంగస్థలం నేపథ్యం. ఈ కాన్సెప్ట్‌ గతంలో ఎన్నో చిత్రాల్లో మనం చూసే ఉంటాం. అయితే ఇలాంటి కథకు సుకుమార్‌ శైలిని జోడిస్తే ఎలా ఉంటుందో అదే ‘రంగస్థలం’. కథ పరంగా పాత్రల ఎంపిక, వాటిని చిత్రీకరించిన విధానం, ఆకట్టుకుంటుంది. కమర్షియల్‌ సినిమాలకు దూరంగా పూర్తి గ్రామీణ వాతావరణంలో సాగుతుంది. ఇలాంటి వాతావరణం ఎక్కువగా తమిళ సినిమాల్లో ఉంటుంది.

వాతావరణానికి తగ్గట్టుగా సెట్స్, ఆర్ట్ వర్క్స్ ఇవన్నీ బాగున్నాయి. ఇక జగపతిబాబు, ఆది, సమంత, అనసూయ రోల్స్ బాగున్నాయి. సమంత రోల్ ఓకే.. రంగమ్మత్తగా అనసూయ బాగా నటించింది. ఆరుపాటలకు నాలుగు బాగున్నాయి. సెకండాఫ్‌లో సెంటిమెంట్ మరీ ఎక్కువైంది.. కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేవు. క్లైమాక్స్ ఓ రేంజ్ కి తీసుకెళ్లింది. ఎక్కువభాగం గోదావరి ప్రాంతంలో షూట్ చేయడం మరో ప్లస్ పాయింట్. దేవీశ్రీ మ్యూజిక్, రత్నవేలు కెమెరా పనితనం బాగుంది.

బలాలు
+ పాత్రలను చిత్రించిన విధానం
+ రామ్‌చరణ్‌ నటన
+ పాటలు, నేపథ్య సంగీతం
+ ట్విస్ట్‌లు
బలహీనతలు
- ప్రథమార్ధం కాస్త మందగమనం

Show Full Article
Print Article
Next Story
More Stories