ఎనర్జిటిక్ హీరో తో డాషింగ్ డైరెక్టర్

పూరి జగన్నాథ్ ఒకప్పుడు టాలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. కానీ 'పైసా వసూల్', 'మెహబూబా' సినిమాలు వరుసగా...
పూరి జగన్నాథ్ ఒకప్పుడు టాలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. కానీ 'పైసా వసూల్', 'మెహబూబా' సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో పూరి ఇమేజ్ బాగా దెబ్బతింది. అయితే ఇప్పుడు తన సత్తా చాటుకోవడానికి త్వరలో మన ముందుకు రానున్నాడు పూరి. ఈసారి ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఒక సినిమా చేయనున్నాడు. పూరి జగన్నాథ్ మరియు ఛార్మి ఈ సినిమాను పూరి టూరింగ్ టాకీస్ మరియు లావణ్య ప్రజెంటేషన్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొత్త సంవత్సరం జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది విడుదల చేస్తామని పూరి జగన్నాథ్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా తాలూకు హీరోయిన్ మరియు ఇతర కాస్ట్ గురించి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటు రామ్ కూడా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నాడు అన్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన 'హలో గురు ప్రేమ కోసమే' కూడా సరిగ్గా ఆడలేదు అని తెలిసిన విషయమే. పూరి జగన్నాథ్ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు రామ్. మరి ఈ ఫ్లాప్ దర్శకుడు మరియు హీరో ఈ సినిమా ద్వారా ఫార్మ్ లోకి వస్తారో లేదో చూడాలంటే వచ్చే ఏడాది మే వరకు ఆగాల్సిందే.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Botsa Satyanarayana: ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాబుకి ఎన్టీఆర్...
28 May 2022 11:24 AM GMTప్రభాస్ ఎలివేషన్ లపై దృష్టి పెట్టానున్న ప్రశాంత్ నీల్
28 May 2022 11:00 AM GMTMalla Reddy: ఎన్టీఆర్కు భారత రత్న కోసం పార్లమెంట్లో పోరాడతాం
28 May 2022 10:52 AM GMTATM PIN Number: ఏటీఎం పిన్ నెంబర్ 4 అంకెలు మాత్రమే ఎందుకు.. కారణం...
28 May 2022 10:45 AM GMTనెల్లూరు జిల్లా శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో...
28 May 2022 10:28 AM GMT